Breaking News

పేస్‌ బౌలర్ల ప్రదర్శన వల్లే...

Published on Thu, 02/22/2024 - 04:12

రాంచీ: ఇంగ్లండ్‌తో గత రెండు టెస్టుల్లో భారత జట్టు విజయం సాధించడంలో పేస్‌ బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారని జట్టు బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అభిప్రాయపడ్డాడు. పిచ్‌లు అనుకూలంగా లేకపోయినా కీలక సమయాల్లో వారు చెలరేగడం వల్లే మ్యాచ్‌లు మనవైపు మొగ్గు చూపాయని అతను అన్నాడు. ఈ సిరీస్‌లో భారత స్పిన్నర్లు తీసిన 36 వికెట్లతో పోలిస్తే పేసర్లు 22 వికెట్లు తీశారు.

‘సాధారణంగా భారత్‌లో దాదాపు అన్ని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తూనే ఉంటాయి. అశ్విన్, జడేజాలు ఎలాగూ ఇక్కడ వికెట్లు తీయగలరు. కానీ మన ఫాస్ట్‌ బౌలర్ల ప్రదర్శనే  సిరీస్‌లో ఇరు జట్ల మధ్య ప్రధాన తేడాగా మారింది. పరిస్థితులకు తగినట్లుగా స్పందించి పేసర్లు జట్టును ముందంజలో నిలిపారు. నాలుగో టెస్టుకు బుమ్రాలాంటి స్టార్‌ బౌలర్‌ దూరం కావడం నిరాశ కలిగించేదే. అయినా ఇతర పేసర్లకూ మంచి అనుభవం ఉంది.

సిరాజ్‌ తీసిన నాలుగు వికెట్ల ప్రదర్శనను మరచిపోవద్దు’ అని గిల్‌ ప్రశంసించాడు. పలువురు కీలక ఆటగాళ్లు దూరం కావడం వల్ల వచ్చిన అవకాశాలను కొత్త ఆటగాళ్లు సమర్థంగా వాడుకున్నారన్న గిల్‌... సర్ఫరాజ్‌ ఖాన్, యశస్వి జైస్వాల్‌లను ఉదాహరణగా చూపించాడు.

తనపై తాను పెట్టుకున్న అంచనాల కారణంగానే కొన్నిసార్లు నిరాశను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇప్పుడు వాటిని అధిగమించి భారీ స్కోర్లపై దృష్టి పెట్టినట్లు అతను చెప్పాడు. తొలి టెస్టులో శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయినా భారత జట్టు...ఆ మ్యాచ్‌ నుంచి పాఠాలు నేర్చుకొని తర్వాతి రెండు టెస్టుల్లో 
ప్రత్యరి్థపై ఒత్తిడి పెంచినట్లు గిల్‌ గుర్తు చేసుకున్నాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)