Breaking News

వైభవ్‌ తుపాన్‌ ఎలా ఆపేది?

Published on Tue, 11/18/2025 - 14:08

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. యూఏఈ-ఎతో జరిగిన తొలి మ్యాచ్‌లో విధ్వంసకర శతకం(42 బంతుల్లో 144 పరుగులు)తో చెలరేగిన వైభవ్.. ఆ తర్వాత పాక్‌పై కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు 14 ఏళ్ల వైభవ్‌.. 189 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతడి స్ట్రైక్ రేటు ఏకంగా 270.00 ఉండడం గమనార్హం. ఇక మంగళవారం ఒమన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌లో కూడా సత్తాచాటాలని సూర్యవంశీ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే వైభవ్ బ్యాటింగ్‌కు అభిమానులే కాదు ఒమన్ ఓపెనింగ్ బ్యాటర్  ఆర్యన్ బిష్ట్ సైతం పిధా అయిపోయాడు. వైభవ్ లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడని తను ఇప్పటివరకు చూడలేదని అతడు కొనియాడాడు.

"గతంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ను టీవీలో చూశాం. ఇప్పుడు మేము అతడికి ప్రత్యర్ధిగా ఆడబోతున్నాం. . సూర్యవంశీని కలిసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది.   అతడి నుంచి చాలా విషయాలు నేర్చకునే ప్రయత్నం చేస్తాను. కేవలం 14 ఏళ్ల వయస్సులో అంతటి భారీ సిక్స్‌లు కొట్టడం నిజంగా గ్రేట్‌. వైభవ్‌కు అద్భుతమైన టాలెంట్ ఉంది. 

అతడు కచ్చితంగా త్వరలో సీనియర్ జట్టుకు ఆడుతాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు దూకుడుకు కళ్లేం వేసేందుకు ప్రయత్నిస్తామని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్యన్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. ఇప్పటికే గ్రూపు-బి నుంచి పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
చదవండి: ‍చెప్పిందే చేశానన్న పిచ్‌ క్యూరేటర్‌.. గంభీర్‌ చర్య వైరల్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)