రబాడను ఎదుర్కొనేందుకు రోహిత్‌ స్పెషల్‌ ప్లాన్‌..

Published on Sun, 12/31/2023 - 11:37

కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు వ్యహాలు రచిస్తోంది. తొలి టెస్టులో ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. శనివారం టీమిండియా నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోంది. 

ఈ ప్రాక్టీస్‌ సెషన్‌కు భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, మహ్మద్‌ సిరాజ్‌ డుమ్మా కొట్టారు. అయితే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబాడను ఎదుర్కొనేందుకు హిట్‌మ్యాన్‌ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. భారత పేసర్‌ ముఖేష్‌ కుమార్‌ బౌలింగ్‌లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

దాదాపు రెండు గంటల పాటు ముఖేష్ బౌలింగ్‌ను రోహిత్‌ ఎదుర్కొన్నాడు. ముఖేష్‌ బౌలింగ్‌లో ఎక్కువగా లెంగ్త్‌ బాల్స్‌ను రోహిత్‌ ప్రాక్టీస్‌ చేశాడు. కాగా గత కాలంగా రబాడ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి శర్మ ఇబ్బంది పడుతున్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కూడా రబాడ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.

ఇప్పటివరకు 14 సార్లు హిట్‌మ్యాన్‌ను రబాడ ఔట్‌ చేశాడు. ఇక జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇ​క ఈ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. జడ్డూ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
చదవండి: ఐపీఎల్‌ ఒలింపిక్స్‌తో సమానం.. చాలా సంతోషంగా ఉంది: లక్నో హెడ్‌ కోచ్‌

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)