Breaking News

హోప్‌ వీరోచిత శతకం.. కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూనే..!

Published on Fri, 12/05/2025 - 10:06

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో విండీస్‌ స్టార్‌ బ్యాటర్‌ షాయ్‌ హోప్‌ (Shai Hope) అద్భుత శతకంతో మెరిశాడు. కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూనే ఈ సెంచరీ నమోదు చేశాడు. 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను (103) కొనసాగిస్తున్నాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాడు.

జస్టిన్‌ గ్రీవ్స్‌తో (42) కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 110 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలవాలంటే ఇంకా 349 పరుగులు చేయాలి. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్‌ 182/4గా ఉంది. నాలుగో రోజు మూడో సెషన్‌ ఆట కొనసాగుతుంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలవలేదు.

అంతకుముందు టామ్‌ లాథమ్‌ (145), రచిన్‌ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (466/8) చేసింది. కీమర్‌ రోచ్‌ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. 

దీనికి ముందు.. జేకబ్‌ డఫీ ఐదేయడంతో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ హోప్‌ (56) రాణించాడు. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.

అంతకుముందు న్యూజిలాండ్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. విండీస్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్‌ విలియమ్సన్‌ (52) ఒక్కడే కివీస్‌ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఇది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)