Breaking News

NZ Vs SL: డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే అదొక్కటే మార్గం: లంక ఆల్‌రౌండర్‌

Published on Tue, 03/07/2023 - 17:00

New Zealand vs Sri Lanka Test Series 2023: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో టీమిండియాపై ఆస్ట్రేలియా తొలి విజయం నేపథ్యంలో శ్రీలంక జట్టులో కొత్త ఆశలు చిగురించాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2023 ఫైనల్‌ చేరే మార్గం సుగమం చేసుకునేందుకు గొప్ప అవకాశం లభించిందంటూ లంక క్రికెటర్లు సంబరపడిపోతున్నారు. అయితే, అదే సమయంలో.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే అదృష్టం కలిసిరావడంతో పాటు కఠిన సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందంటున్నారు.

స్వదేశంలో తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన రోహిత్‌ సేన.. మూడో మ్యాచ్‌లో మాత్రం ఆసీస్‌ చేతిలో పరాభవం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌, ఢిల్లీ టెస్టులను రెండున్నర రోజుల్లోనే ముగించిన భారత జట్టు.. ఇండోర్‌లో అదే రీతిలో ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది. దీంతో.. ఆస్ట్రేలియా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టగా.. టీమిండియా మరికొన్ని రోజుల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి. అహ్మదాబాద్‌ టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

అయినప్పటికీ.. న్యూజిలాండ్‌- శ్రీలంక టెస్టు ఫలితం తేలిన తర్వాతే ఇంగ్లండ్‌లో ఆసీస్‌ను ఫైనల్లో ఢీకొట్టే జట్టు గురించి అధికారిక ప్రకటన వస్తుంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో పదింట 5 టెస్టులు గెలిచిన శ్రీలంక.. 53.33 విజయశాతంతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఒకవేళ లంక ఫైనల్‌ చేరాలంటే ఆసీస్‌ చేతిలో టీమిండియా ఓడటం సహా న్యూజిలాండ్‌ గడ్డపై ఆతిథ్య జట్టును లంక 2-0తో క్లీన్‌స్వీప్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, అదేమీ అంత తేలికైన విషయం కాదు. శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ కూడా ఇదే మాట అంటున్నాడు.

ఫైనల్‌ చేరాలంటే అదే ఏకైక మార్గం.. కాబట్టి
‘‘న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడం అంటే అత్యంత కష్టంతో కూడుకున్న పని. అయితే, గత పర్యటనలో మేము మెరుగైన ప్రదర్శన కనబరచడం సానుకూలాంశం. ఏదేమైనా ఇక్కడ గెలవాలంటే వాళ్లెలాంటి వ్యూహాలు అమలు చేస్తారో మేము కూడా అలాంటి ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది. వాళ్లు మాకు కఠిన సవాలు విసురుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంగ్లండ్‌ దూకుడైన ఆటతో టెస్టులకు సరికొత్త నిర్వచనం చెబుతోంది. వాళ్ల శైలి వాళ్లది.. మా ఆట తీరు మాది. అయితే, మేమేమీ ఒత్తిడికి లోనుకావడం లేదు. అయితే.. ఫైనల్‌ చేరాలంటే మా ముందున్న ఏకైక మార్గం రెండు మ్యాచ్‌లు గెలవడమే. అందుకోసం మేము అత్యుత్తమ ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది’’ అని మాథ్యూస్‌ పేర్కొన్నాడు. కాగా మార్చి 9 నుంచి కివీస్‌- లంక జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది.

అంతకంటే ముందు జరిగిన వార్మప్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓడిన సౌథీ బృందం.. రెండో టెస్టులో ఒక్క పరుగు తేడాతో గెలుపొంది సిరీస్‌ను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి పటిష్ట జట్టు, డబ్ల్యూటీసీ టైటిల్‌ తొలి విజేత న్యూజిలాండ్‌ను ఓడించాలంటే లంక అద్భుతం చేయాల్సి ఉంటుంది!

చదవండి: BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్‌! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా?
LSG New Jersey: లక్నో కొత్త జెర్సీ.. మరీ ఇంత చెత్తగా ఉందేంటి? దీని కంటే అదే నయం!

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)