Breaking News

రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్‌-సౌతాఫ్రికా రెండో టెస్ట్‌

Published on Thu, 02/15/2024 - 14:59

రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హ్యామిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుంది. కఠినమైన పిచ్‌పై పర్యాటక సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌కు 267 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ వికెట్‌ కోల్పోయి 40 పరుగులు చేసింది. మూడో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా.. డెవాన్‌ కాన్వే (17) ఔటయ్యాడు. కాన్వే ఔటయ్యాక అంపైర్లు మూడో రోజు ఆటను ముగించారు. న్యూజిలాండ్‌ గెలవాలంటే ఇంకా 227 పరుగులు చేయాలి. పిచ్‌ బౌలర్లకు సహకరిస్తుండటంతో రేపు ఫలితం తేలడం ఖాయమని తెలుస్తుంది. 

అంతకుముందు బెడింగ్హమ్‌ (110) కెరీర్‌లో తొలి శతకంతో విజృంభించడంతో సౌతాఫ్రికా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసి ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బెడింగ్హమ్‌తో పాటు నీల్‌ బ్రాండ్‌ (34), కీగన్‌ పీటర్సన్‌ (43), హమ్జా (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విలియమ్‌ రూర్కీ ఐదు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. 

దీనికి ముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం హాఫ్‌ సెంచరీ చేయలేకపోయారు. 43 పరుగులు చేసిన విలియమ్సన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్‌ డి పైడ్ట్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకు ఆలౌటైంది. రుయాన్‌ డి స్కార్డ్ట్‌ (64) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్‌ పేసర్‌ విలియమ్‌ రూర్కీ నాలుగు వికెట్లతో రాణించాడు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌ విజయం‍ సాధించింది. క్రికెట్‌ సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌ పర్యటనకు ద్వితియ శ్రేణి జట్టును పంపించింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)