Breaking News

NZ VS PAK 1st T20: డారిల్‌ మిచెల్‌ ఊచకోత

Published on Fri, 01/12/2024 - 13:43

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేసింది. డారిల్‌ మిచెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (27 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి కివీస్‌ భారీ స్కోర్‌ చేయడంలో కీలకపాత్ర పోషించగా.. 417 రోజుల తర్వాత టీ20 మ్యాచ్‌ ఆడుతున్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో (57) రాణించాడు.

ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఫిన్‌ అలెన్‌ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో మార్క్‌ చాప్‌మన్‌ (11 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో డెవాన్‌ కాన్వే, ఐష్‌ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ 19, ఆడమ్‌ మిల్నే 10 పరుగులు చేశారు. మ్యాట్‌ హెన్రీ 0, టిమ్‌ సౌథీ 6 పరుగులతో అజేయంగా నిలిచారు.

డారిల్‌ మిచెల్‌ క్రీజ్‌లో ఉన్న సమయంలో కివీస్‌ 250కి పైగా పరుగులు చేసేలా కనిపించింది. అయితే అతను ఔటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవ్వరూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడకపోవడంలో కివీస్‌ 226 పరుగులతో సరిపెట్టుకుంది. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది (4-0-46-3), ఆమిర్‌ జమాల్‌ (4-0-56-0), ఉసామా మిర్‌లను (4-0-51-0) కివీస్‌ బ్యాటర్లు ఆటాడుకున్నారు. ముఖ్యంగా షాహీన్‌ అఫ్రిది, ఉసామా మిర్‌లకు చుక్కలు చూపించారు.

కివీస్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌.. షాహీన్‌ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో 2 సిక్స్‌లు, 3 బౌండరీల సాయంతో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. పాకిస్తాన్‌ను అబ్బాస్‌ అఫ్రిది (4-0-34-3), హరీస్‌ రౌఫ్‌ (4-0-34-2) కాపాడారు. వీరిద్దరు కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా వికెట్లు కూడా తీశారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)