NZ VS ENG 2nd Test: శతక్కొట్టి జట్టును గట్టెక్కించిన కేన్‌ మామ

Published on Mon, 02/27/2023 - 11:11

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. ఫాలో ఆన్‌ ఆడిన న్యూజిలాండ్‌ అనూహ్య రీతిలో పుంజుకుని రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగుల భారీ స్కోర్‌ను సాధించి, ప్రత్యర్ధికి 258 పరుగుల డిఫెండింగ్‌ టార్గెట్‌ను నిర్ధేశించింది. 258 టార్గెట్‌ను ఛేజ్‌ చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. తమదైన స్టయిల్‌లో ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది.

వరుస బౌండరీలతో విరుచుకుపడిన జాక్‌ క్రాలే (30 బంతుల్లో 24; 5 ఫోర్లు) మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో ఓటవ్వగా.. బెన్‌ డక్కెట్‌ (23), ఓలీ రాబిన్సన్‌ (1) ఆచితూచి ఆడుతున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసి, లక్ష్యానికి 210 పరుగుల దూరంలో ఉంది.  

కాగా, ఓవర్‌నైట్‌ స్కోర్‌ 202/3తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్‌.. అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి మ్యాచ్‌ చేజారకుండా కాపాడుకునే ప్రయత్నం చేసింది. న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ (132) సూపర్‌ సెంచరీతో జట్టును ఆదుకోగా.. డారిల్‌ మిచెల్‌ (54), టామ్‌ బ్లండల్‌ (90) తమ పాత్రలను న్యాయం చేశారు. మూడో రోజు ఆటలో కివీస్‌ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ (83), డెవాన్‌ కాన్వే (61) అర్ధసెంచరీలతో రాణించి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. భీకర ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్‌ (176 బంతుల్లో 186; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ సెంచరీతో శివాలెత్తగా.. రూట్‌ (153 నాటౌట్‌) అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మ్యాట్‌ హెన్రీ 4 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్‌ 2, సౌథీ, వాగ్నర్‌ తలో వికెట్‌ దక్కించకున్నారు.

అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్‌ ఆడింది. కెప్టెన్‌ సౌథీ (49 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇ​న్నింగ్స్‌ ఆడకపోతే న్యూజిలాండ్‌ ఈ మాత్రం కూడా స్కోర్‌ చేయలేకపోయేది. ఇంగ్లండ్‌ వెటరన్‌ పేస్‌ సింహాలు ఆండర్సన్‌ (3/37), స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/61) మరోసారి చెలరేగగా. జాక్‌ లీచ్‌ (3/80) పర్వాలేదనిపించాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.    

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)