Breaking News

NZ vs AUS 2nd Test: ఆసీస్‌ అద్భుతం

Published on Tue, 03/12/2024 - 02:00

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌ను ఆ్రస్టేలియా 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అలెక్స్‌ క్యారీ (98 నాటౌట్‌; 15 ఫోర్లు), మిచెల్‌ మార్ష్‌ (80; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అసాధారణ పోరాటంతో రెండో టెస్టులో ఆసీస్‌ 3 వికెట్ల తేడాతో కివీస్‌పై గెలిచింది. 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 77/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్‌ 80 పరుగులకే ఐదో వికెట్‌ కోల్పోయింది. దీంతో ఆసీస్‌ కు పరాజయం ఖాయమనిపించింది.

కానీ మార్ష్‌ , క్యారీ ఆరో వికెట్‌కు 140 పరుగులు జోడించడంతో మ్యాచ్‌ ఫలితమే మారిపోయింది. 220 స్కోరు వద్ద మార్ష్‌ ని్రష్కమించినా, స్టార్క్‌ (0) డకౌటైనా... కెపె్టన్‌ కమిన్స్‌ (32 నాటౌట్‌; 4 ఫోర్లు), క్యారీ అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలిపించారు.  2005 నుంచి కివీస్‌ గడ్డపై ఆ్రస్టేలియా వరుసగా ఏడు టెస్టుల్లో గెలిచింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో సంయుక్తంగా ఇది రెండో అత్యుత్తమ వరుస విజయాల ఘనత. సఫారీ గడ్డపై ఇంగ్లండ్‌ (1889 నుంచి 1999 వరకు) 8 వరుస టెస్టుల్లో గెలిచింది. జింబాబ్వేపై కివీస్‌ (2000 నుంచి ఇప్పటివరకు) వరుసగా 7 టెస్టులు గెలిచింది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)