Breaking News

శతక్కొట్టిన మావీ.. కుషాగ్రా డబుల్‌ సెంచరీ

Published on Sun, 11/09/2025 - 19:02

రంజీ ట్రోఫీలో ఇవాళ (నవంబర్‌ 9) చాలామంది ప్లేయర్లు సత్తా చాటారు. యూపీ ఆటగాడు శివమ్‌ మావీ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. జార్ఖండ్‌ ఆటగాడు కుమార్‌ కుషాగ్రా డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. జమ్యూ కశ్మీర్‌ ఆటగాడు పరస్‌ డోగ్రా కెరీర్‌లో 34వ ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీ నమోదు చేశాడు.

మేఘాలయ ఆటగాడు ఆకాశ్‌ చౌదరీ 8 బంతుల్లో వరుసగా సిక్సర్లు బాది 11 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్‌ క్లాస్‌ ఇదే ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ. అలాగే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరూ వరుసగా 8 బంతుల్లో సిక్సర్లు బాదలేదు.

హైదరాబాద్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రాహుల్‌ రాధేశ్‌ సూపర్‌ సెంచరీతో మెరిశాడు. బెంగాల్‌ ఆటగాడు సుమంత్‌ గుప్తా, చత్తీస్‌ఘడ్‌ ఆటగాడు మయాంక్‌ వర్మ కెరీర్‌లో తొలి సెంచరీలు నమోదు చేశారు. మణిపూర్‌ ప్లేయర్‌ అల్‌ బషిద్‌ సెంచరీతో మెరిశాడు. 

త్రిపురకు ఆడుతున్న తమిళనాడు ఆటగాడు విజయ​్‌ శంకర్‌ భారీ శతకంతో కదంతొక్కాడు. మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా తన 26వ బర్త్‌ డే రోజున అర్ద సెంచరీతో రాణించాడు.

బౌలింగ్‌ విషయానికొస్తే..  కర్ణాటక శ్రేయస్‌ గోపాల్‌, తమిళనాడు సందీప్‌ వారియర్‌, సౌరాష్ట్ర కెప్టెన్‌ జయదేశ్‌ ఉనద్కత్‌, బెంగాల్‌ బౌలర్‌ సూరజ్‌ సింధు తలో నాలుగు వికెట్లతో సత్తా చాటారు. గుజరాత్‌ బౌలర్‌ సిద్దార్థ్‌ దేశాయ్‌ ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఢిల్లీ బౌలర్‌ సిమర్‌జీత్‌ సింగ్‌ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. 

చదవండి: సూపర్‌ ఫామ్‌లో పృథ్వీ షా

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)