Breaking News

సచిన్‌, కోహ్లి కాదు! 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఆదర్శం ఇతడే!

Published on Sat, 11/30/2024 - 21:27

వైభవ్‌ సూర్యవంశీ.. క్రికెట్‌ వర్గాల్లో ఇప్పుడీ పేరు హాట్‌టాపిక్‌. పన్నెండేళ్ల వయసులోనే రంజీ మ్యాచ్‌ ఆడిన ఈ బిహారీ చిచ్చరపిడుగు... ఇటీవలే మరో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

పదమూడేళ్ల ఈ కుర్రాడి కోసం రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 1.10 కోట్లు ఖర్చు చేసింది. కాగా ప్రస్తుతం వైభవ్‌ సూర్యవంశీ అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌తో మాట్లాడిన వైభవ్‌ తన ఐడల్‌ ఎవరో చెప్పేశాడు.  

సచిన్‌, కోహ్లి కాదు! అతడే ఆదర్శం
మెజారిటీ మంది టీమిండియా అభిమానులు ఊహించినట్లుగా వైభవ్‌ సచిన్‌ టెండుల్కర్‌, విరాట్‌ కోహ్లి, మహేంద్ర సింగ్‌, రోహిత్‌ శర్మల పేరు చెప్పలేదు. అతడికి వెస్టిండీస్‌ దిగ్గజం లారా ఆదర్శమట. ‘‘బ్రియన్‌ లారా నాకు ఆదర్శం. నేను ఆయనలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాను. అయితే, నాదైన సహజ శైలిని మాత్రం విడిచిపెట్టను. 

నాకున్న నైపుణ్యాలను మరింత పెంపొందించుకునేందుకు కృషి​ చేస్తా. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఈ టోర్నీ మీదే ఉంది. నా చుట్టూ ఏం జరుగుతుందన్న విషయంతో సంబంధం లేదు’’ అని వైభవ్‌ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.

పట్టించుకోను
ఐపీఎల్‌లో తన డిమాండ్‌, తన వయసు పదమూడు కాదు.. పదిహేను అంటూ వస్తున్న ఆరోపణలను పట్టించుకోనని వైభవ్‌ కుండబద్దలుకొట్టాడు. కాగా దుబాయ్‌ వేదికగా అండర్‌-19 ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. 

చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో 44 పరుగుల తేడాతో అమాన్‌ సేన ఓటమిని మూటగట్టుకుంది. ఇక శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్‌ ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. యువ టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో ఆడనుంది.   

చదవండి: IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్‌ రికార్డు బ్రేక్‌ చేసేవాడు!
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)