Breaking News

ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్‌ అతడే: రిక్కీ పాంటింగ్‌

Published on Thu, 12/12/2024 - 12:38

ఇంగ్లండ్‌ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం రిక్కీ పాంటింగ్‌ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌ అతడేనంటూ బ్రూక్‌ను కొనియాడాడు. స్వదేశంలోనే.. విదేశీ గడ్డపై కూడా అతడు బ్యాట్‌ ఝులిపించే తీరు చూడముచ్చటగా ఉంటుందని ప్రశంసించాడు.

అగ్రపీఠం అధిరోహించిన బ్రూక్‌
కాగా 25 ఏళ్ల హ్యారీ బ్రూక్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ఫామ్‌తో పరుగుల వరద పారిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ (898 రేటింగ్‌ పాయింట్లు)గా నిలిచాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బ్రూక్‌ వరుసగా 171, 123, 55 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నంబర్‌వన్‌గా ఉన్న మరో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జో రూట్‌ (898)ను వెనక్కి నెట్టి అగ్రపీఠం అధిరోహించాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్‌ హ్యారీ బ్రూక్‌ గురించి ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్‌ అతడే
‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్‌ అతడే అనుకుంటున్నా. కేవలం సొంతగడ్డ మీద మాత్రమే కాదు.. విదేశాల్లోనూ అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు దేశాల్లో ఏక​ంగా ఏడు శతకాలు నమోదు చేశాడు. అతడొక క్లాస్‌ ప్లేయర్‌. బ్రూక్‌ బ్యాటింగ్‌ చేస్తూ ఉంటే చూడటం నాకు ఎంతో ఇష్టం’’ అని రిక్కీ పాంటింగ్‌ హ్యారీ బ్రూక్‌ను కొనియాడాడు.

ఏడు సెంచరీలు విదేశీ గడ్డపైనే 
కాగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్‌.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు . ఇందులో ఏడు సెంచరీలు విదేశీ గడ్డపై చేసినవే. అదే విధంగా అతడి ఖాతాలో ద్విశతకం, ఒక త్రిశతకం కూడా ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ హ్యారీ బ్రూక్‌ పేరిట ఒక సెంచరీ ఉంది.

మొత్తంగా ఇప్పటి వరకు తన కెరీర్‌లో హ్యారీ బ్రూక్‌ ఇంగ్లండ్‌ తరఫున 23 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 2280, 719, 707 పరుగులు సాధించాడు.

మనోళ్ల పరిస్థితి ఏంటి?
ఇదిలా ఉంటే.. ఐసీసీ టాప్‌–10 టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత్‌ నుంచి యశస్వి జైస్వాల్‌ (4వ స్థానం), రిషభ్‌ పంత్‌ (9వ స్థానం) ఉండగా...శుబ్‌మన్‌ గిల్‌ 17వ, విరాట్‌ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నారు. 

మరోవైపు.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (890) తన నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కగిసో రబాడ (856), హాజల్‌వుడ్‌ (851) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్‌ ర్యాంక్‌ 4 నుంచి 5కు పడిపోగా, జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్లలో జడేజా (415) అగ్ర స్థానం, అశ్విన్‌ 3వ స్థానం (283) పదిలంగా ఉన్నాయి. 

చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్‌ లేకుండానే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)