Breaking News

రింకూ కాదు!.. టీమిండియా ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అతడే: సూర్య

Published on Sat, 07/27/2024 - 18:02

శ్రీలంకతో సిరీస్‌ సందర్భంగా టీమిండియా టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. పొట్టి ఫార్మాట్లో భారత్‌ను నంబర్‌ వన్‌గా నిలపడంతో పాటు టీ20 ప్రపంచకప్‌ అందించిన రోహిత్‌ శర్మ వారసత్వాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కొత్త కోచ్‌ గౌతం గంభీర్‌ మార్గదర్శనంలో జూలై 27న రెగ్యులర్‌ కెప్టెన్‌ హోదాలో తన తొలి మ్యాచ్‌ ఆడబోతున్నాడు.

 జట్టులో అతడే కీలకం
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియా యువ క్రికెటర్‌పై ప్రశంసలు కురిపించాడు. జట్టులో అతడే కీలకం(ఎక్స్‌ ఫ్యాక్టర్‌) కాబోతున్నాడంటూ సదరు ఆటగాడి నైపుణ్యాలను కొనియాడాడు. సూర్య ప్రశంసించిన క్రికెటర్‌ మరెవరో కాదు అసోం ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆకట్టుకుంటున్న ఈ రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు ఇటీవలే టీమిండియాలో అరంగేట్రం చేశాడు.

జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ సందర్భంగా శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలోని జట్టుకు ఎంపికైన రియాన్‌ పరాగ్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టూర్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం 25 పరుగులే చేశాడు. అయినప్పటికీ ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశారు. 

అతడే ఎందుకంటూ విమర్శలు
అంతేకాదు వన్డే జట్టులోనూ తొలిసారిగా చోటిచ్చారు. జింబాబ్వే సిరీస్‌లో సెంచరీ చేసిన అభిషేక్‌ శర్మ, అద్భుతంగా రాణించిన రుతురాజ్‌ గైక్వాడ్‌ వంటి వాళ్లను పక్కనపెట్టి రియాన్‌ను సెలక్ట్‌ చేయడం విమర్శలకు దారితీసింది. అయితే, ఆల్‌రౌండర్‌ ప్రతిభ కారణంగానే అతడికి జట్టులో చోటు దక్కాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

పూర్తిగా మారిపోయాడు
ఈ నేపథ్యంలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రియాన్‌ పరాగ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘అన్ని రకాల క్రీడల్లో ట్రోలింగ్‌ అనేది కామన్‌. అయితే, దానిని మనం ఎలా అధిగమిస్తామన్నదే ముఖ్యం. రియాన్‌ పరాగ్‌ ప్రతిభావంతుడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్నపుడే.. ఏ జట్టులోనైనా అతడొక ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అవగలడని అంచనా వేశాను. ఇప్పుడు తను పూర్తిగా మారిపోయాడు. 

విమర్శల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు. గత రెండేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు అతడు మా జట్టుతో ఉండటం సంతోషం’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. కాగా రియాన్‌ పరాగ్‌ విఫలమైనప్పుడల్లా అతడిపై నెట్టింట తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక లంకతో మొదటి టీ20లో మాత్రం రియన్‌కు తుదిజట్టులో చోటు దక్కే ఛాన్స్‌ లేదు!
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)