Breaking News

‘ఒక్క మ్యాచ్‌కే తప్పిస్తారా?.. అతడి కోసం నితీశ్‌ రెడ్డి త్యాగం చేయాల్సింది’

Published on Thu, 07/10/2025 - 14:30

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరు సరికాదని భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ విమర్శించాడు. చారిత్రాత్మక గెలుపు కారణంగా తుదిజట్టు ఎంపిక విషయంలో చేసిన కొన్ని పొరపాట్లు కనుమరుగైపోయాయని పేర్కొన్నాడు. ఫలితం అనుకూలంగా రాకపోయి ఉంటే.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవని అభిప్రాయపడ్డాడు.

కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా (IND vs ENG).. లీడ్స్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, అందుకు ప్రతీకారం తీర్చుకుని ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి గెలుపు జెండా ఎగురవేసి చారిత్రాత్మక​ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. సాయి సుదర్శన్‌, శార్దూల్‌ ఠాకూర్‌లపై మాత్రం వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాల్లో ఆకాశ్‌ దీప్‌ (Akash Deep), వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి (Nitish Kumar Reddy)లను జట్టులోకి తీసుకుంది.

ఈ నేపథ్యంలో సంజయ్‌ మంజ్రేకర్‌ మాట్లాడుతూ.. సాయి సుదర్శన్‌పై వేటు వేయడాన్ని తప్పుబట్టాడు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన అతడిని తప్పించాల్సిన అవసరం లేదని.. మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. నిజానికి కరుణ్‌ నాయర్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌ కాదని.. సాయి ఈ స్థానంలో సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు.

ఒక్క మ్యాచ్‌కే తప్పిస్తారా?.. 
‘‘గత మ్యాచ్‌లో టీమిండియా యాజమాన్యం కొన్ని ఆసక్తికర ఎంపికలు చేసింది. వాటితో నేను ఏమాత్రం ఏకీభవించడం లేదు. రెండో టెస్టులో గెలిచిన కారణంగా ఇవన్నీ కనుమరుగైపోయాయి.

నిజానికి సాయి సుదర్శన్‌ విషయంలో వారు చేసింది తప్పు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ యువ ఆటగాడికి మరో అవకాశం ఇవ్వాల్సింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు బాగానే ఆడాడు. కాబట్టి రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించాల్సింది.

కానీ వాళ్లు అతడిని తప్పించారు. మూడో స్థానంలో సాయి సుదర్శన్‌ సరైన బ్యాటర్‌. కరుణ్‌ నాయర్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరికాదు. విఫలమైనా కరుణ్‌కి అవకాశాలు ఇచ్చినప్పుడు సాయి సుదర్శన్‌కు కూడా ఛాన్స్‌ ఇవ్వాల్సింది కదా!

అతడి కోసం నితీశ్‌ రెడ్డి త్యాగం చేయాల్సింది
అలా అని నేనేమీ కరుణ్‌ నాయర్‌కు వ్యతిరేకం కాదు. చాలా ఏళ్ల తర్వాత కష్టపడి అతడు జట్టులోకి వచ్చాడు. అయితే, అతడు మాత్రం వన్‌డౌన్‌లో ఆడే బ్యాటర్‌ మాత్రం కాదు. నిజానికి లోయర్‌ ఆర్డర్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి కరుణ్‌ కోసం త్యాగం చేయాల్సింది’’ అని మంజ్రేకర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు. 

కాగా లీడ్స్‌ టెస్టుతో టీమిండియా తరఫున సంప్రదాయ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్‌ డకౌట్‌ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 30 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మరోవైపు.. కరుణ్‌ నాయర్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం 20 పరుగులే చేశాడు. ఇక భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య గురువారం నుంచి లార్డ్స్‌లో మూడో టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌తో బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)