Breaking News

బుమ్రా కాదు!.. ఈసారి టాప్‌ వికెట్‌ టేకర్‌ అతడే!

Published on Tue, 02/03/2026 - 16:55

పొట్టి క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి శనివారం (ఫిబ్రవరి 7) తెరలేవనుంది. ఇందులో భాగంగా తొలిరోజు ముంబైలోని వాంఖడే వేదికగా టీమిండియా అమెరికాతో తలపడనుంది.

నాలుగు గ్రూపులు
ఇక అదే రోజు కొలంబోలో పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌, కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక ఈసారి ఈ మెగా టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. వీటిని ఐదేసి జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్‌-ఎ నుంచి డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా, పాకిస్తాన్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ .. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్‌, ఒమన్‌, శ్రీలంక, జింబాబ్వే పోటీలో ఉన్నాయి. గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ల, ఇటలీ.. గ్రూప్‌-డిలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, యూఏఈ, కెనడా బరిలో నిలిచాయి.

ఉపఖండ పిచ్‌లపై వరల్డ్‌కప్‌
ఇక ఈసారి ఉపఖండ పిచ్‌లపై వరల్డ్‌కప్‌ జరగడం స్పిన్నర్లకు అనుకూలించే అంశం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెగ్రాత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని అంచనా వేశాడు. 

రేసులో వారు సైతం
అయితే, టాప్‌ వికెట్‌ టేకర్ల పోటీలో టీమిండియా పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆసీస్‌ స్టార్లు జోష్‌ హాజిల్‌వుడ్‌, ఆడం జంపా, ఇంగ్లండ్‌ ఆటగాడు సామ్‌ కర్రాన్‌ కూడా ఉంటాడని మెగ్రాత్‌ పేర్కొన్నాడు.

టీ20 టాప్‌ బౌలర్‌
కాగా రషీద్‌ ఖాన్‌ అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికి 111 మ్యాచ్‌లలో కలిపి 187 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్‌-2024లో టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచి "ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు" అందుకున్న బుమ్రా ఖాతాలో.. 102 అంతర్జాతీయ టీ20 వికెట్లు ఉన్నాయి.

అభిషేక్‌ శర్మకే ఇద్దరి ఓటు
ఇదిలా ఉంటే. ఆసీస్‌ మాజీ పేసర్‌ డెమేన్‌ ఫ్లెమింగ్‌ మాత్రం వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా బుమ్రాకే ఓటు వేశాడు. ఇక ఈసారి టాప్‌ రన్‌ స్కోరర్‌గా టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మను మెగ్రాత్‌ ఎంచుకోగా.. ఫ్లెమింగ్‌ కూడా అతడికి మద్దతు పలికాడు. కాగా గత కొన్నాళ్లుగా సూపర్‌ ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

చదవండి: టీమిండియాతో ఆడకున్నా.. ఆ మూడు మ్యాచ్‌లు గెలుస్తాం: పాక్‌ కెప్టెన్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)