అక్రం, వార్న్‌ కాదు!.. నేను ఎదుర్కొన్న డేంజరస్‌ బౌలర్‌ అతడే: గంగూలీ

Published on Tue, 06/24/2025 - 17:25

భారత క్రికెట్‌లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఆటగాళ్లలో సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) ఒకడు. కెప్టెన్‌గా భారత జట్టు దశ దిశను మార్చిన ఘనత అతడి సొంతం. అంతేకాదు.. సచిన్‌ టెండుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌లతో కూడిన తన సమకాలీన అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు దాదా.

విదేశీ గడ్డపై తాను ఎదుర్కొన్న ప్రతీ బౌలర్‌పై గంగూలీ ఒకానొక సందర్భంలో పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 1992లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన దాదా.. 1996లో టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.

పదహారేళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో టీమిండియా తరఫున 113 టెస్టులు ఆడిన గంగూలీ.. పదహారు శతకాల సాయంతో 7212 పరుగులు సాధించాడు. అదే విధంగా.. 311 వన్డేల్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ 11363 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ధ శతకాలు ఉన్నాయి.

గంగూలీని భయపెట్టిన బౌలర్‌ ఎవరో తెలుసా?
ఇంతటి అనుభవం, అసాధారణ నైపుణ్యాలు ఉన్న గంగూలీని భయపెట్టిన బౌలర్‌ ఎవరో తెలుసా?.. దాదానే స్వయంగా ఈ విషయం గురించి మాట్లాడాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న బౌలర్లలో తనను ఎక్కువగా భయపెట్టింది
ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెగ్రాత్‌ అని గంగూలీ తెలిపాడు.  

తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్ల జాబితాలో భాగమైన పాక్‌ పేస్‌ లెజెండ్‌ వసీం అక్రం, ఆసీస్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ల పేర్లు కాకుండా దాదా మెగ్రాత్‌ పేరు చెప్పడం విశేషం. కాగా 1999-2011 మధ్య ఆస్ట్రేలియా అత్యంత పటిష్టమైన జట్టుగా కొనసాగింది.

మూడుసార్లు వరుసగా కంగారూ జట్టు వన్డే వరల్డ్‌కప్‌ అందుకుంది. ఇక ఆసీస్‌ ప్రధాన బౌలర్లలో ఒకడైన మెగ్రాత్‌ది ఇందులో కీలక పాత్ర. ఈ రైటార్మ్‌ పేసర్‌ 1993- 2007 మధ్య ఆస్ట్రేలియా తరఫున 124 టెస్టుల్లో 563 వికెట్లు పడగొట్టాడు.

అదే విధంగా.. 250 వన్డేల్లో మెగ్రాత్‌ 381 వికెట్లు కూల్చాడు. రెండు టీ20 మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో ఒకప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు మెగ్రాత్‌ ఆడాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు.

చదవండి: IND vs ENG: రిషబ్‌ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ..
 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)