Breaking News

కోహ్లి, రోహిత్ కాదు.. గూగుల్‌లో ఎక్కువ మంది వెతికింది అత‌డినే

Published on Fri, 12/05/2025 - 18:19

టీమిండియా లెజెండ్స్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి  క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఐపీఎల్‌లో అతడి ఆట కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. 

అదేవిధంగా రో-కో ద్వయం కూడా కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నప్పటికి వారిని ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. కానీ 2025 ఏడాదిలో వీరి ముగ్గురుని ఓ యువ క్రికెటర్ అధిగమించాడు. అతడి గురుంచి తెలుసుకునేందుకు నెటజన్లు గూగుల్‌లో తెగ వెతికేశారు. అతడే భారత అండర్‌-19 సంచలనం, ఫ్యూచర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ.

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ  ఈ ఏడాది గూగుల్‌లో భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. ఈ వండర్ కిడ్  ఐపీఎల్, ఇండియా 'ఎ'మ్యాచ్‌లు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో తన సంచలన ప్రదర్శనతో అందరిని ఆకర్షించాడు. దీంతో అతడి గురుంచి తెలుసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపారు. వైభవ్ 12 ఏళ్ల వయస్సలోనే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు.

కాగా గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2025' నివేదిక ప్రకారం.. వైభవ్ అగ్రస్ధానంలో ఉండగా మరో యువ సంచలనం పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్దానంలో  అభిషేక్ శర్మ మరియు షేక్ రషీద్ నిలిచారు. అదేవిధంగా మహిళల ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన  జెమీమా రోడ్రిగ్స్ గురుంచి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారు.
చదవండి: ఇండిగో సంక్షోభం.. బీసీసీఐకి ఊహించని షాక్‌!
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)