Breaking News

పాక్‌, సౌతాఫ్రికా కాదు.. సెమీస్‌కు చేరే జట్లు ఇవే

Published on Tue, 02/03/2026 - 11:00

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ.. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది.

ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. అయితే ఈ పొట్టి ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఆఖరి నిమిషంలో తప్పుకొంది. దీంతో బంగ్లా స్ధానాన్ని స్కాట్లాండ్‌తో ఐసీసీ భర్తీ చేసింది. తాజాగా పాకిస్తాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ఏడాది వరల్డ్‌కప్ ఆరంభానికి ముందే తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్  మైఖేల్ వాన్  వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు వాన్ షాకిచ్చాడు. తను ఎంచుకున్న టాప్‌-4 జట్ల జాబితాలో సౌతాఫ్రికాకు వాన్ చోటు ఇవ్వలేదు. 

భారత్, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. టీ20ల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో భారత్‌కు వాన్ మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం పాకిస్తాన్‌ను కూడా పరిగణలోకి తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ కూడా భారత్‌కే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మెగా టోర్నీ సన్నాహ‌ల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో భార‌త్ దుమ్ములేపింది.
చదవండి: పాక్‌కు ఇదేమి కొత్త కాదు.. కచ్చితంగా వెనక్కి తగ్గుతుంది: గావస్కర్‌

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)