Breaking News

భారత అంపైర్‌కు గొప్ప గౌరవం

Published on Wed, 03/06/2024 - 16:59

భారత​ అంపైర్‌ నితిన్‌ మీనన్‌కు గొప్ప గౌరవం దక్కనుంది. ప్రపంచ క్రికెట్‌లో ఫాబ్‌ ఫోర్‌గా పిలువబడే నలుగురు స్టార్‌ క్రికెటర్ల వందో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇతను  అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. 

ఇదివరకే విరాట్‌ కోహ్లి, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌ల వందో టెస్ట్‌ మ్యాచ్‌కు అంపైర్‌గా పని చేసిన మీనన్‌.. ఫాబ్‌ ఫోర్‌లోని మరో ఆటగాడైన కేన్‌ విలియమ్సన్‌ వందో టెస్ట్‌లో కూడా అంపైర్‌గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. 

ఓ తరంలో నలుగురు గొప్ప క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్‌ల్లో అంపైర్‌గా వ్యవహరించే గొప్ప గౌరవం నితిన్‌ మీనన్‌ మాత్రమే దక్కనుంది. విలియమ్సన్‌ వందో టెస్ట్‌ మ్యాచ్‌ మార్చి 8న ప్రారంభమవుతుంది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్‌ కేన్‌ మామతో పాటు న్యూజిలాండ్‌ ప్రస్తుత కెప్టెన్‌ టిమ్‌ సౌథీకి కూడా వందో టెస్ట్‌ మ్యాచ్‌ కానుంది.

కేన్‌, సౌథీ వందో టెస్ట్‌ మ్యాచ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు మరో ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు తమ వందో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్నారు. భారత వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో రేపటి నుంచి ప్రారంభంకాబోయే భారత్‌-ఇంగ్లండ్‌ ఐదో టెస్ట్‌ మ్యాచ్‌తో వంద టెస్ట్‌ల మైలురాయిని తాకనున్నారు. ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ 0-1తో వెనుకపడి ఉంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు