Breaking News

చరిత్ర సృష్టించిన నికోలస్‌ పూరన్‌.. ఐపీఎల్‌ హిస్టరీలోనే

Published on Thu, 05/22/2025 - 23:06

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ నికోల‌స్ పూర‌న్ త‌న ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచ‌రీతో పూర‌న్ చెల‌రేగాడు. ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్ వ‌చ్చిన పూర‌న్.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఊతికారేశాడు.

కేవ‌లం 24 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న పూర‌న్‌..4 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 56 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో పూర‌న్ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజ‌న్‌లో 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అత్య‌ధిక సార్లు 50 ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్‌గా పూర‌న్ చ‌రిత్ర సృష్టించాడు. 

ఇంతకుముందు ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో హెడ్ నాలుగు సార్లు 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో తన ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా హాఫ్ సెంచరీతో హెడ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. 

ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన పూరన్‌.. 46.45 సగటుతో 511 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 64 బంతులు ఎదుర్కొన్న మార్ష్‌.. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 117 పరుగులు చేశాడు.
చదవండి: IND vs ENG: టీమిండియా బౌలర్లకు వార్నింగ్‌.. సెంచరీతో చెలరేగిన డకెట్‌

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)