Breaking News

న్యూజిలాండ్‌ 4/4 

Published on Thu, 10/19/2023 - 02:54

చెన్నై: టాస్‌ గెలిచి కూడా ఫీల్డింగ్‌ ఎంచుకొని చేసిన తప్పుడు వ్యూహంతో పాటు ఫీల్డింగ్‌లో మూడు క్యాచ్‌లు వదిలేసిన వైఫల్యం చివరకు అఫ్గనిస్తాన్‌ భారీ ఓటమికి కారణంగా మారింది. తడబడుతూ ఇన్నింగ్స్‌ కొనసాగించి చివర్లో చెలరేగిన న్యూజిలాండ్, ఆపై బౌలింగ్‌లో సత్తా చాటగా...పేలవ బ్యాటింగ్‌లో అఫ్గన్‌ కుప్పకూలింది. దాంతో కివీస్‌ ఖాతాలో వరుసగా నాలుగో విజయం చేరింది. బుధవారం జరిగిన పోరులో కివీస్‌ 149 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గ్లెన్‌ ఫిలిప్స్‌ (80 బంతుల్లో 71; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెపె్టన్‌ లాథమ్‌ (74 బంతుల్లో 68; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విల్‌ యంగ్‌ (64 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఆరంభంలో 109/1తో పటిష్టంగా ఉన్న కివీస్‌ పరుగు తేడాతో 3 వికెట్లు కోల్పోయి 110/4 వద్ద నిలిచింది. ఈ స్థితిలో లాథమ్, ఫిలిప్స్‌ ఐదో వికెట్‌కు 144 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అయినా సరే టీమ్‌ ఒక దశలో 44 ఓవర్లలో 210 పరుగులే చేసింది.

కానీ చివరి 6 ఓవర్లలో బ్యాటర్లు చెలరేగడంతో ఏకంగా 78 పరుగులు సాధించగలిగింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. రహ్మత్‌ షా (62 బంతుల్లో 36; 1 ఫోర్‌) టాప్‌ స్కోరర్‌. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలనం రేపిన అఫ్గన్‌ గత వరల్డ్‌ కప్‌ రన్నరప్‌ ముందు అదే స్థాయి పోరాటపటిమ కనబర్చలేక చేతులెత్తేసింది.  

స్కోరు వివరాలు 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్‌ 20; విల్‌ యంగ్‌ (సి) ఇక్రామ్‌ (బి) ఒమర్జాయ్‌ 54; రచిన్‌ (బి) ఒమర్జాయ్‌ 32; మిచెల్‌ (సి) ఇబ్రహీమ్‌ (బి) రషీద్‌ 1; లాథమ్‌ (బి) నవీనుల్‌ 68; ఫిలిప్స్‌ (సి) రషీద్‌ఖాన్‌ (బి) నవీనుల్‌ 71; చాప్‌మన్‌ నాటౌట్‌ 25; సాన్‌ట్నర్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 288. 
వికెట్ల పతనం: 1–30, 2–109, 3–110, 4–110, 5–254, 6–255. బౌలింగ్‌: ముజీబ్‌ 10–0–57–1, ఫరూఖీ 7–1–39–0, నవీనుల్‌ 8–0–48–2, నబి 8–1–41–0, రషీద్‌ ఖాన్‌ 10–0–43–1, అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 7–0–56–2. 
అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (బి) హెన్రీ 11; ఇబ్రహీమ్‌ (సి) సాన్‌ట్నర్‌ (బి) బౌల్ట్‌ 14, రహ్మత్‌ షా (సి) అండ్‌ (బి) రచిన్‌ 36; హష్మతుల్లా (సి) సాన్‌ట్నర్‌ (బి) ఫెర్గూసన్‌ 8; ఒమర్జాయ్‌ (సి) లాథమ్‌ (బి) బౌల్ట్‌ 27; ఇక్రామ్‌ నాటౌట్‌ 19; నబి (బి) సాన్‌ట్నర్‌ 7; రషీద్‌ఖాన్‌ (సి) మిచెల్‌ (బి) ఫెర్గూసన్‌ 8; ముజీబ్‌ (సి) యంగ్‌ (బి) ఫెర్గూసన్‌ 4; నవీనుల్‌ (సి) చాప్‌మన్‌ (బి) సాన్‌ట్నర్‌ 0; ఫరూఖీ (సి) మిచెల్‌ (బి) సాన్‌ట్నర్‌ 0;  ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (34.4 ఓవర్లలో ఆలౌట్‌) 139. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–43, 4–97, 5–107, 6–125, 7–134, 8–138, 9–139, 10–139. 
బౌలింగ్‌: బౌల్ట్‌ 7–1–18–2, హెన్రీ 5–2–16–1, సాన్‌ట్నర్‌ 7.4–0–39–3, ఫెర్గూసన్‌ 7–1–19–3, ఫిలిప్స్‌ 3–0–13–0, రచిన్‌ రవీంద్ర 5–0–34–1.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)