Breaking News

రాణించిన కాన్వే, మిచెల్‌.. న్యూజిలాండ్‌ 307 పరుగులకు ఆలౌట్‌

Published on Fri, 08/01/2025 - 08:57

బులవాయో (జింబాబ్వే): బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో... జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ మంచి స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 92/0తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ చివరకు 96.1 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.

డెవాన్‌ కాన్వే (170 బంతుల్లో 88; 12 ఫోర్లు), డారిల్‌ మిచెల్‌ (119 బంతుల్లో 80; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో రాణించగా... విల్‌ యంగ్‌ (70 బంతుల్లో 41; 4 ఫోర్లు), హెన్రీ నికోల్స్‌ (34; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రచిన్‌ రవీంద్ర (2), బ్లండెల్‌ (2), బ్రేస్‌వెల్‌ (9) విఫలమయ్యారు.

జింబాబ్వే బౌలర్లలో ముజర్‌బాని 3, చివాంగ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జింబాబ్వే ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.

బెనెట్‌ (18), బెన్‌ కరన్‌ (11) పెవిలియన్‌ చేరగా... నిక్‌ వెల్చ్‌ (2 బ్యాటింగ్‌), మసెకెసా (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. కివీస్‌ బౌలర్లలో హెన్రీ, రూర్కె చెరో వికెట్‌ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న జింబాబ్వే... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: IND vs ENG 5th Test: ఆధ‌ర్మసేన.. ఇంగ్లండ్‌కు ఫేవ‌ర్‌గా అంపైర్‌! ఫ్యాన్స్ ఫైర్‌

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)