IND VS NZ 2nd T20I: న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌

Published on Fri, 01/23/2026 - 20:59

రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

న్యూజిలాండ్‌ ఈ స్కోర్‌ చేసేందుకు ప్రతి ఒక్కరి దోహదపడ్డారు. రచిన్‌ రవీంద్ర (44), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (47 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు. 

కాన్వే (19), సీఫర్ట్‌ (24), ఫిలిప్స్‌ (19), డారిల్‌ మిచెల్‌ (18), మార్క్‌ చాప్‌మన్‌ (10), జకరీ ఫౌల్క్స్‌ (15 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నంతసేపు బ్యాట్‌ ఝులిపించారు. ఆఖర్లో సాంట్నర్‌, ఫౌల్క్స్‌ క్యామియో న్యూజిలాండ్‌ను 200 పరుగుల మార్కును దాటించింది.

భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 2, హార్దిక్‌ పాండ్యా, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ దూబే తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్‌ సింగ్‌ (4-0-53-0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.  

రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా
ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్‌ పటేల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్‌ రాణాను ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో తెచ్చారు.

మరోవైపు న్యూజిలాండ్‌ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్‌ స్థానంలో టిమ్‌ సీఫర్ట్‌.. క్రిస్టియన్‌ క్లార్క్‌ స్థానంలో జకరీ ఫౌల్క్స్‌, జేమీసన్‌ స్థానంలో మ్యాట్‌ హెన్రీ తుది జట్టులో​కి వచ్చారు.

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తుది జట్లు..

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ

భారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)