Breaking News

కాన్వేకు ప్రమోషన్‌.. కివీస్‌ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే!

Published on Wed, 06/17/2026 - 12:20

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆట‌గాళ్ల‌కు సంబంధించిన సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ (2026-27) రెన్యువల్‌ జాబితాను విడుద‌ల చేసింది. కివీస్ సీనియ‌ర్ ఆట‌గాడు డెవాన్ కాన్వే సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌లో తిరిగి చోటు ద‌క్కించుకున్నాడు. కొన్నేళ్లుగా టీ20 లీగ్స్‌లో బిజీగా గ‌డుపుతూ వచ్చిన కాన్వే గ‌త రెండేళ్లుగా కివీస్ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌లో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. 

ఇటీవ‌లే న్యూజిలాండ్ దిగ్గ‌జ క్రికెట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్ప‌డంతో కివీస్ బోర్డు తాజాగా సెంట్ర‌ల్ కాంట్రాక్టు జాబితాను స‌వ‌రించింది. ఈ నేప‌థ్యంలోనే విలియ‌మ్స‌న్ స్థానంలో కాన్వేకు చోటు క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే ఐర్లాండ్‌తో జ‌రిగిన ఏకైక టెస్టులో ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న  ఫాస్ట్ బౌల‌ర్ బ్లెయిర్ టిక్న‌ర్ కూడా సెంట్ర‌ల్ కాంట్రాక్టులో చోటు ద‌క్కించుకున్నాడు. 

గతసారి కాంట్రాక్టు దక్కించుకోలేకపోయిన పలువురు ప్రముఖ ఆటగాళ్లను తాజా జాబితాలో చేర్చ‌గా; అదే సమయంలో అందులో కొందరు మాత్రం తమను టెస్ట్ కాంట్రాక్టు జాబితాలో చేర్చవద్దని బోర్డును కోరిన‌ట్లు తెలుస్తోంది. అయితే కొన్ని వారాల్లో ప్ర‌క‌టించ‌నున్న సాధార‌ణ కాంట్రాక్ట్ లిస్టులో టిమ్ సీఫర్ట్‌, ఫిన్ అలెన్‌తో పాటు జాక్ ఫోక్స్‌, మిచ్ హే కూడా చోటు ద‌క్కించుకునే అవ‌కాశ‌ముంది. 

కివీస్‌కు మూడు ఫార్మాట్ల‌లో కీల‌క ఆట‌గాళ్లుగా ఉన్న మిచెల్ సాంట్న‌ర్‌, ర‌చిన్ ర‌వీంద్ర‌, టామ్ లాథ‌మ్‌, మాట్ హెన్రీలు స‌హా మిగ‌తా క్రికెట‌ర్లు సెంట్ర‌ల్ కాంట్రాక్టు జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న న్యూజిలాండ్ నేటి నుంచి ఓవల్‌ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఎడ్జ్‌బాస్ట‌న్ వేదికగా జ‌రిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 115 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాల‌య్యింది.

న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆట‌గాళ్ల జాబితా: 
టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ రూర్కీ, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్

చదవండి: అల్జీరియాపై గెలుపు.. కంటతడి పెట్టిన మెస్సీ!

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు