Breaking News

భారత్‌తో తొలి టీ20.. న్యూజిలాండ్‌ తుది జట్టు ఇదే..!

Published on Tue, 01/20/2026 - 20:42

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం. ప్రపంచకప్‌కు ముందు జరుగబోయే చివరి సిరీస్‌ కావడంతో ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ అన్ని కాంబినేషన్లను పరీక్షించే అవకాశం ఉంది.

ఓపెనర్లుగా టిమ్‌ రాబిన్సన్‌, డెవాన్‌ కాన్వే బరిలోకి దిగడం లాంఛనమే. వీరిలో రాబిన్సన్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాన్వే టీ20 ఫామ్‌ కాస్త కలవరపెడుతున్నా, ఇతర ఫార్మాట్లలో మంచి టచ్‌లో ఉండటం​ ఊరట కలిగించే అంశం. ఫస్ట్‌ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌ కావడంతో తుది జట్టులో కాన్వే స్థానం పక్కా. 

వన్‌డౌన్‌లో రచిన్‌ రవీంద్ర రావడం​ కూడా దాదాపుగా ఖాయమే. రచిన్‌కు ఈ స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 మ్యాచ్‌ల్లో 143.81 స్ట్రయిక్‌రేట్‌తో 325 పరుగులు చేశాడు. స్పిన్ బౌలర్లపై ఎదురుదాడి చేయగల సమర్దత రచిన్‌ను ఈ స్థానానికి ఫిక్స్‌ చేస్తుంది.

న్యూజిలాండ్‌ మిడిలార్డర్‌లో చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ ఆ జట్టుకు ఎలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం రాదు. నాలుగో స్థానంలో డారిల్‌ మిచెల్‌, ఆతర్వాత మార్క్‌ చాప్‌మన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ లాంటి బలమైన హిట్టర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు. సమయానుసారంగా వీరి స్థానాల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

లోయర్‌ ఆర్డర్‌ విషయానికొస్తే.. ఇక్కడ కూడా దాదాపు అన్ని బెర్త్‌లు ఖరారై ఉన్నాయి. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కమ్‌ బ్యాటర్‌గా మిచెల్‌ సాంట్నర్‌ ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సాంట్నర్‌ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేయవచ్చు. సాంట్నర్‌కు భారత్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఇక్కడ అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.

న్యూజిలాండ్‌ పేస్‌ బౌలింగ్‌ విభాగం మిగతా విభాగాల కంటే అత్యంత పటిష్టంగా ఉంది. గతేడాది ఫార్మాట్లకతీతంగా చెలరేగిన మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ తుది జట్టులో ఉంటారు. వీరికి మరో ఇన్‌ ఫామ్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ జత కలుస్తాడు. ఈ ముగ్గురితో కివీస్‌ పేస్‌ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది.

ఐష్‌ సోది డౌటే..!
భారత్‌పై ఐష్‌ సోధికి అద్భుత రికార్డు (20 మ్యాచ్‌లు, 25 వికెట్లు, ఎకానమీ 7.54) ఉన్నా, జట్టు కాంబినేషన్ కారణంగా తొలి మ్యాచ్‌లో అతనికి ఆడే అవకాశం రాకపోవచ్చు. సాంట్నర్‌తో పాటు రవీంద్ర, బ్రేస్‌వెల్, చాప్‌మన్, ఫిలిప్స్ స్పిన్ ఆప్షన్లుగా అందుబాటులో ఉన్నారు.

భారత్‌తో తొలి టీ20కి న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా): మిచెల్‌ సా​ంట్నర్‌ (కెప్టెన్‌), మార్క్‌ చాప్‌మన్‌, టిమ్‌ రాబిన్సన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, డెవాన్‌ కాన్వే, మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ, కైల్‌ జేమీసన్‌.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)