Breaking News

పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన

Published on Wed, 04/03/2024 - 18:16

ఏప్రిల్‌ 18-27 మధ్యలో పాకిస్తాన్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ టీ20 సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 3) ప్రకటించారు. ఈ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ క్రికెట్‌ 15 మంది సభ్యుల బృందాన్ని పాకిస్తాన్‌కు పంపనుంది. ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్,కేన్ విలియ‍మ్సన్‌ లాంటి సీనియర్లు ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో న్యూజిలాండ్‌ సెలెక్టర్లు ద్వితియ శ్రేణి జట్టును పాక్‌కు పంపనున్నారు.

ఈ జట్టుకు మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ సారధ్యం వహించనున్నాడు. ఫిన్‌ అలెన్‌, మార్క్‌ చాప్‌మన్‌, ఆడమ్‌ మిల్నే, జిమ్మీ నీషమ్‌, ఐష్‌ సోధి లాంటి గుర్తింపు పొందిన ఆటగాళ్లు మినహా మిగతావన్నీ కొత్త ముఖాలే. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు న్యూజిలాండ్‌ ఆటగాళ్లకు ఇది చాలా ముఖ్యమైన సిరీస్‌. ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కని వారికి ఈ సిరీస్‌ కీలకంగా పరిగణించబడుతుంది. ఈ సిరీస్‌లో రాణిస్తే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లు రావల్పిండిలో జరుగనుండగా.. ఆఖరి రెండు లాహోర్‌లో జరుగనున్నాయి. 

పాకిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు.. 
మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, బెన్ లిస్టర్, కోల్ మెక్‌కాన్చీ, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్క్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీపర్‌), ఐష్‌ సోధి

షెడ్యూల్‌..

  • తొలి టీ20: ఏప్రిల్‌ 18 (రావల్పిండి)
  • రెండో టీ20: ఏప్రిల్‌ 20 (రావల్పిండి)
  • మూడో టీ20: ఏప్రిల్‌ 21 (రావల్పిండి)
  • నాలుగో టీ20: ఏప్రిల్‌ 25 (లాహోర్‌)
  • ఐదో టీ20: ఏప్రిల్‌ 27 (లాహోర్‌)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)