శ్రీలంక ఖేల్‌ ఖతం

Published on Thu, 02/26/2026 - 01:01

కొలంబో: టి20 ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక సొంతగడ్డపై కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో చిత్తయిన లంక... ఇప్పుడు న్యూజిలాండ్‌ చేతిలోనూ ఓడింది. ఫలితంగా రెండు పరాజయాలతో సెమీస్‌ అవకాశాలు కోల్పోయింది. బుధవారం జరిగిన ‘గ్రూప్‌–2’ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. 

ఈ గ్రూప్‌ నుంచి ఇంగ్లండ్‌ ఇప్పటికే సెమీస్‌ చేరగా, తాజా విజయంతో కివీస్‌ అవకాశాలు మెరుగయ్యాయి. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే కివీస్‌ కూడా సెమీస్‌లోకి అడుగు పెడుతుంది. ఓడితే శనివారం పాక్, లంక మ్యాచ్‌ ఫలితం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. పాక్‌ ఓడితే కివీస్‌కు చోటు ఖాయమవుతుంది. పాక్‌ గెలిస్తే అప్పుడు రన్‌రేట్‌లో పోటీ పడాల్సి ఉంటుంది.  

టాస్‌ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (26 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రచిన్‌ రవీంద్ర (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కోల్‌ మెక్‌కోన్‌కీ (23 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా... ఫిన్‌ అలెన్‌ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. 9.2 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ 75/2తో మెరుగైన స్థితిలోనే ఉంది. 

అయితే లంక బౌలర్లు చెలరేగడంతో 9 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 84/6కు చేరింది. ఈ దశలో సాంట్నర్, మెక్‌కోన్‌కీ ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. చివరి 4 ఓవర్లలో న్యూజిలాండ్‌ 6 సిక్స్‌లు, 4 ఫోర్లతో 70 పరుగులు రాబట్టడం విశేషం. 

ఆరు వికెట్లు కోల్పోయే సమయానికి 84 పరుగులు చేసిన కివీస్‌... తర్వాతి వికెట్‌ భాగస్వామ్యంలో సరిగ్గా అన్నే పరుగులు చేయడం విశేషం. టి20 వరల్డ్‌ కప్‌లో గతంలో ఏడో వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం 74 పరుగులు (మైక్‌ హస్సీ, స్టీవ్‌ స్మిత్‌ మధ్య 2010లో) కాగా...సాంట్నర్, మెక్‌కోన్‌కీ దీనిని సవరించారు. మహీశ్‌ తీక్షణ, దుష్మంత చమీర చెరో 3 వికెట్లు పడగొట్టారు.  

అనంతరం లక్ష్య ఛేదనలో లంక పూర్తిగా తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే నిసాంక (0) బౌల్డ్‌ కావడంతో మొదలైన పతనం వేగంగా సాగింది. అసలంక (5), కుశాల్‌ మెండిస్‌ (11), పవన్‌ రత్నాయకే (10), షనక (3) వరుస కట్టి పెవిలియన్‌కు చేరడంతో 10.3 ఓవర్లలో 46 పరుగులకే జట్టు సగం వికెట్లు కోల్పోయింది. 

ఆ తర్వాత కమిందు మెండిస్‌ (31; 4 ఫోర్లు), వెలలాగె (29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడినా దాని ప్రభావం ఫలితంపై పడలేదు. రచిన్‌ రవీంద్ర (4/27) లంకను కుప్పకూల్చగా, హెన్రీకి 2 వికెట్లు దక్కాయి. రచిన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)