Breaking News

న్యూజిలాండ్‌ బోణీ

Published on Sat, 10/11/2025 - 04:14

గువాహటి: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్‌ న్యూజిలాండ్‌ ఆలస్యంగా బోణీ చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన కివీస్‌ జట్టు శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. టాపార్డర్‌ బ్యాటర్లు సుజీ బేట్స్‌ (29; 6 సిక్స్‌లు), ప్లిమర్‌ (4), అమెలియా కెర్‌ (1) విఫలమవడంతో 38 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు పడ్డాయి. 

ఈ దశలో కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (85 బంతుల్లో 63; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బ్రూక్‌ హాలిడే (104 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్‌) నాలుగో వికెట్‌కు 112 పరుగులు జోడించడంతో కివీస్‌ కుదురుకుంది. అయితే 29 పరుగుల వ్యవధిలో వీళ్లిద్దరు అవుటయ్యాక న్యూజిలాండ్‌ మళ్లీ తడబడింది. ఆఖరి ఓవర్లలో మ్యాడీ గ్రీన్‌ (25; 3 ఫోర్లు), జెస్‌ కెర్‌ (0), రోజ్‌మేరీ (2), ఇసాబెల్లా గేజ్‌ (12) వికెట్లను కోల్పోయింది. 

ప్రత్యర్థి బౌలర్లలో  రబియా ఖాన్‌ 3 వికెట్లు పడగొట్టింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు 39.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫాహిమా ఖాతూన్‌ (34; 2 ఫోర్లు), రబియా ఖాన్‌ (25; 2 ఫోర్లు)  రాణించారు. జెస్‌ కెర్, లీ తహుహు చెరో 3 వికెట్లు తీయగా, రోజ్‌మేరీకి 2 వికెట్లు దక్కాయి. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టుతో శ్రీలంక తలపడుతుంది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)