Breaking News

Asia Cup 2025: నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు?

Published on Sun, 09/14/2025 - 22:23

ఆసియాకప్‌-2025లో పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా ఏ మాత్రం అంచ‌నాలను అందుకోలేక‌పోతున్నాడు. ఈ మెగా టోర్నీలో వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ స‌ల్మాన్ అలీ విఫ‌ల‌మ‌య్యాడు. ఒమ‌న్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డ‌కౌటైన స‌ల్మాన్‌.. ఇప్పుడు దుబాయ్ వేదిక‌గా భార‌త్‌తో మ్యాచ్‌లో కూడా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

కీల‌క స‌మ‌యంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట‌ర్ తొలి బంతి నుంచే భార‌త స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కొవ‌డానికి తీవ్రంగా శ్ర‌మించాడు. ఆఖ‌రికి 12 బంతులు ఆడి కేవ‌లం 3 ప‌రుగులు చేసిన స‌ల్మాన్‌.. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. అత‌డి వికెట్‌ పాక్ మరింత ఒత్తిడిలో కూరుకుపోయింది.

దీంతో కెప్టెన్‌గా దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న అలీ అఘాను నెటిజ‌న్లు ట్రోల్‌ చేస్తున్నారు. నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు? అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. మహ్మద్ రిజ్వాన్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన సల్మాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కెప్టెన్‌గా ఒకట్రెండు సిరీస్‌లు గెలిపించినప్పటికి ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాక్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)