Breaking News

నేపాల్‌ క్రికెట్‌కు బీసీసీఐ చేయూత.. భారత్‌లో ట్రై సిరీస్‌ నిర్వహణ

Published on Mon, 02/19/2024 - 20:54

నేపాల్‌ క్రికెట్‌కు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) చేయూతనందించేందుకు ముందుకు వచ్చింది. ఆర్దికంగా వెనుకపడిన నేపాల్‌ క్రికెట్‌ బోర్డుకు లబ్ది చేకూరే విధంగా ఆ దేశ క్రికెట్‌ జట్టుతో ట్రైయాంగులర్‌ సిరీస్‌ను ప్లాన్‌ చేసింది. భారత దేశవాలీ ఛాంపియన్‌ జట్లైన్‌ బరోడా, గుజరాత్‌ జట్లు మార్చి 31-ఏప్రిల్‌ 7 మధ్యలో నేపాల్‌ టీమ్‌తో ట్రై సిరీస్‌ ఆడనున్నాయి. ఈ టోర్నీ మొత్తం గుజరాత్‌లోని వాపి క్రికెట్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ ట్రై సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను నేపాల్‌ క్రికెట్‌ బోర్డు ఇవాళ (ఫిబ్రవరి 19) విడుదల చేసింది. 

అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లతో టోర్నీమెంట్‌ ఆడటం ద్వారా నేపాల్‌ జట్టుకు అంతర్జాతీయ అనుభవం​ వచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్‌ 2024 నేపథ్యంలో ఈ టోర్నీ నేపాల్‌ జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. 

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రన్నరప్‌ అయిన బరోడా టీమ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా సారథ్యం వహించనుండగా.. గుజరాత్ జట్టులో పియూష్ చావ్లా, రవి బిష్ణోయ్ లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు. ఈ ట్రై సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. నేపాల్‌ జట్టు మార్చి 31న గుజరాత్‌తో, ఏప్రిల్ 2న బరోడాతో, ఏప్రిల్ 3న మళ్లీ గుజరాత్‌తో, ఏప్రిల్ 5న మరోసారి బరోడాతో తలపడనుంది. ఏప్రిల్ 7న ఫైనల్ మ్యాచ్‌ జరుగుతుంది. కాగా, నేపాల్‌ జట్టు ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)