Breaking News

నక్క తోక తొక్కిన భారత ఆటగాడు! మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. అస్సలు ఊహించలేదు!

Published on Fri, 06/23/2023 - 17:32

వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలుత టెస్టు, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను భారత సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అయితే సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో కొన్ని అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఐపీఎల్‌లో అద్భుతమైన అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యశస్వీ జైశ్వాల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు తొలిసారిగా టెస్టు జట్టులో చోటు దక్కగా.. వెటరన్‌ ఆటగాడు ఛతేశ్వర్‌ పుజారాపై వేటు పడింది.

మరోవైపు మూడేళ్ల నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్‌ నవదీప్‌ సైనీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీతో టెస్టు క్రికెట్‌లోకి సైనీ అరంగేట్రం చేశాడు. అయితే తన డెబ్యూ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన సైనీ.. ఇప్పటివరకు టెస్టుల్లో మరి కన్పించలేదు.

సైనీ 4 ఇన్నింగ్స్‌లో 4.11 ఏకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు.  అదే విధంగా ఇప్పటివరకు 8 వన్డే, 11 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.  ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సైనీ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడేందుకు వోర్సెస్టర్‌షైర్ క్రికెట్‌ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే సైనీకి సెలక్టర్లు నుంచి పిలుపు రావడం గమానర్హం. జూలై 12 నుంచి భారత పర్యటన ప్రారంభం కానుంది.

విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కెఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. 

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
చదవండి: IND vs WI: అతడేం నేరం చేశాడు.. ప్రతీసారి ఇంతే! నిజంగా సిగ్గుచేటు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)