Breaking News

టి20 వరల్డ్‌కప్‌లో నమీబియా, జింబాబ్వే

Published on Sat, 10/04/2025 - 03:18

దుబాయ్‌: వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ప్రపంచకప్‌నకు నమీబియా, జింబాబ్వే అర్హత సాధించాయి. ఆఫ్రికా రీజినల్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కించుకున్నాయి. సెమీఫైనల్లో జింబాబ్వే 7 వికెట్ల తేడాతో కెన్యాపై విజయం సాధించగా... నమీబియా 63 పరుగుల తేడాతో టాంజానియాపై గెలుపొందింది. తద్వారా మెగా టోర్నీకి అర్హత సాధించాయి. 

2026 ఫిబ్రవరి, మార్చి మధ్య జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొంటాయి. అందులో భారత్, శ్రీలంక ఆతిథ్య హక్కులతో నేరుగా అర్హత సాధించగా... 2024 వరల్డ్‌కప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అఫ్గానిస్తాన్, ఆ్రస్టేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్‌ జట్లు వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కించుకున్నాయి. ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం అర్హత సాధించాయి. 

దీంతో మొత్తం 12 జట్లు మెగా టోర్నీ బెర్త్‌ దక్కించుకోగా... మిగిలిన ఎనిమిది జట్లను వివిధ క్వాలిఫయింగ్‌ టోర్నీల ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే జరిగిన అమెరికా క్వాలిఫయర్స్‌లో కెనడా జట్టు... యూరప్‌ క్వాలిఫయర్స్‌లో ఇటలీ, నెదర్లాండ్స్‌ జట్లు  టోర్నీకి బెర్త్‌ దక్కించుకోగా... తాజాగా ఆఫ్రికా క్వాలిఫయర్స్‌ నుంచి నమీబియా, జింబాబ్వే ముందంజ వేశాయి. దీంతో వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 17 జట్లపై స్పష్టత రాగా... ఆసియా క్వాలిఫయర్స్‌ ద్వారా మరో మూడు జట్లను ఎంపిక చేయనున్నారు.  

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)