Breaking News

టీమిండియాలో రీఎంట్రీ ఇస్తా.. 100 టెస్టులు ఆడటమే లక్ష్యం

Published on Tue, 01/16/2024 - 14:55

 Aim is to play 100 Test matches: టీమిండియా తరఫున 85 అంతర్జాతీయ టెస్టులు.. 12 సెంచరీలు.. ఇందులో ఒకటి ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో.. మరొకటి మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో సాధించినది.. ఇక అర్ధ శతకాలు 26.. మొత్తంగా 5077 పరుగులు..

ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక టెస్టు సిరీస్‌ గెలిచిన భారత జట్టుకు సారథి.. 13 ఏళ్ల కెరీర్‌లో ముంబై బ్యాటర్‌ అజింక్య రహానే సాధించిన ఘనతలు. అయితే, ప్రస్తుతం జాతీయ జట్టులో 35 ఏళ్ల వెటరన్‌ బ్యాటర్‌కు అవకాశాలు కరువయ్యాయి.

విఫలమై.. జట్టుకు దూరమై
యువ ఆటగాళ్ల నుంచి ఎదురవుతున్న పోటీలో ఈ టెస్టు స్పెషలిస్టు వెనుబడిపోయాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌- 2021-23 తర్వాత వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియాకు ఆఖరిసారిగా ఆడిన రహానే.. వైస్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.

కానీ ఆ టూర్‌లో వైఫల్యం కారణంగా మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ ఆడనున్న జట్టు ఎంపిక సందర్భంగానూ సెలక్టర్లు అతడికి మొండిచేయే చూపారు. ఈ నేపథ్యంలో అజింక్య రహానే అంతర్జాతీయ కెరీర్‌ ఇక ముగిసిపోయినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆకాశ్‌ చోప్రా వంటి భారత మాజీ క్రికెటర్లు సైతం ఇదే మాట అంటున్నారు.

రీఎంట్రీ ఇస్తా.. 
అయితే, రహానే మాత్రం తాను కచ్చితంగా టీమిండియా తరఫున పునరాగమనం చేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. 100 టెస్టులు ఆడటమే తన ఆశయం అంటున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ-2024లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. ఆంధ్రతో జరిగిన రెండో మ్యాచ్‌ సందర్భంగా జట్టుతో చేరాడు.

100 టెస్టులు ఆడటమే లక్ష్యం
డకౌట్‌గా వెనుదిరిగి విమర్శల పాలయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందడంతో సారథిగా రహానేకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర జట్టుపై విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘ముంబై తరఫున మెరుగైన స్కోర్లు నమోదు చేయాలని పట్టుదలగా ఉన్నాను.

ఈసారి ఎలాగైనా రంజీ ట్రోఫీ గెలవాలనే సంకల్పంతో ఉన్నాం. అలాగే నా ముందున్న మరో అతిపెద్ద లక్ష్యం.. టీమిండియా తరఫున 100 టెస్టులు పూర్తిచేసుకోవడమే’’ అని అజింక్య రహానే చెప్పుకొచ్చాడు.

చదవండి: Shreyas Iyer: బాధ లేదు.. నాకు అప్ప‌గించిన ప‌ని పూర్తి చేశా.. ఇక‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)