Breaking News

ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ సంచలన నిర్ణయం

Published on Wed, 01/07/2026 - 08:05

ఐపీఎల్‌-2026 నుంచి తొలగించబడ్డ బంగ్లాదేశీ ఆటగాడు ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కాకపోతే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ అని అంటున్నాడు. ముస్తాఫిజుర్‌ కేకేఆర్‌ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ ఆదేశాలతో ఐపీఎల్‌ గవర్నింగ్‌ బాడీ రద్దు చేసిన తర్వాత ముస్తాఫిజుర్‌ పీఎస్‌ఎల్‌ డ్రాఫ్ట్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ముస్తాఫిజుర్‌ చివరిగా 2017-18 సీజన్‌లో పీఎస్‌ఎల్‌ ఆడాడు. ఆ సీజన్‌లో అతను లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

కాగా, ఐపీఎల్‌ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రతరం​ కావడం..  ఈ నేపథ్యంలో బంగ్లాదేశీ ప్లేయర్‌ అయిన ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తొలిగించడం జరిగిపోయాయి. 

ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తొలిగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్‌ చేసింది. భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌-2026 గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.

ఐసీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తాజాగా తమ దేశానికి చెందిన అంపైర్లను ప్రపంచకప్‌కు పంపించబోమని అంటుంది. బంగ్లాదేశ్‌ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రపంచ వేదికపై ఆ దేశ క్రికెట్‌ జట్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

 

 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)