Breaking News

ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న టీమిండియా యువ సంచలనం హవా.. మరో సెంచరీ, 6 వికెట్లు

Published on Fri, 07/04/2025 - 19:59

ఇంగ్లండ్‌ పర్యటనలో భారత యువ సంచలనం ముషీర్‌ ఖాన్‌ హవా కొనసాగుతోంది. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఎమర్జింగ్‌ టీమ్‌ (MCA Colts) తరఫున ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న ముషీర్‌.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అదిరిపోయే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనలతో అదరగొట్టాడు.

Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో 123 పరుగులు (127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో) చేసిన ముషీర్‌.. ఆతర్వాత బౌలింగ్‌లో 6 వికెట్ల ప్రదర్శన (8.2 ఓవర్లలో 6/31) నమోదు చేశాడు.

తాజాగా రెండో మ్యాచ్‌లోనూ ముషీర్‌ తొలి మ్యాచ్‌ తరహా ప్రదర్శనలు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో కూడా ముషీర్‌ సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి భారత క్రికెట్‌ అభిమానులు ముషీర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

భారత క్రికెట్‌కు మరో  భవిష్యత్తు తార దొరికాడని ఆకాశానికెత్తుతున్నారు. ముషీర్‌కు సంబంధించిన తాజా వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

కారు ప్రమాదం నుంచి బయటపడి..!
20 ఏళ్ల ముషీర్‌ గతేడాది సెప్టెంబర్‌లో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ముషీర్‌ మెడకు బలమైన గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత ముషీర్‌ ఆడుతున్న తొలి రెడ్‌ బాల్‌ టోర్నీ ఇదే. ముషీర్‌ తన చివరి రెడ్‌ బాల్‌ మ్యాచ్‌ను దులీప్‌ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడాడు. 

గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ముషీర్‌ ఐపీఎల్‌ 2025లో ఆడాడు (పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఓ మ్యాచ్‌). ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో ముషీర్‌ డకౌటై నిరాశపరిచాడు. ఆ మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ముషీర్‌ 3 బంతులు ఎదుర్కొని సుయాశ్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్‌లో ముషీర్‌ బంతితో పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి మయాంక్‌ అగర్వాల్‌ వికెట​ పడగొట్టాడు.

ముషీర్‌ ఖాన్‌ మరో టీమిండియా అప్‌ కమింగ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు. ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్‌.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్‌ సెంచరీ కూడా ఉంది.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ముషీర్‌ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్‌ 2024 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్‌ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్‌.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)