Breaking News

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మురళీ విజయ్‌.. ఇప్పటికీ ఆ రికార్డు తన పేరిటే

Published on Tue, 01/31/2023 - 11:49

టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ మురళీ విజయ్‌  అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన విజయ్‌.. సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. విజయ్‌ చివరగా తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో ఆడాడు. ఈ టోర్నీలో మదురై పాంథర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

ఇక​ 38 ఏళ్ల విజయ్‌ టీమిండియా తరఫున 61 టెస్ట్‌లు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 15 హాఫ్‌ సెంచరీల సాయంతో 3982 పరుగులు చేశాడు. అదే విధంగా వన్డేల్లో ఒక హాఫ్‌తో పాటు 339 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌ విషయానికి వస్తే  106 మ్యాచ్‌లు ఆడిన విజయ్‌.. 2 సెంచరీలు, 13 హాఫ్‌ సెంచరీల సాయంతో 2619 పరుగులు చేశాడు. విజయ్‌ చివరగా 2020 ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడాడు. ఇక అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌ నుంచి తప్పుకున్న విజయ్‌ విదేశీ లీగ్‌ల్లో ఆడే అవకాశం ఉంది.

ఇప్పటికే విజయ్‌ పేరునే..
కాగా విజయ్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్నప్పటకీ ఓ అరుదైన రికార్డు మాత్రం తన పేరిట సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 2010 ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నైకు ప్రాతినిథ్యం వహించిన విజయ్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో  127 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీంతో ఐపీఎల్‌ సీఎస్‌కే తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఆటగాడిగా విజయ్‌ నిలిచాడు. ఇప్పటికి ఈ రికార్డు విజయ్‌ పేరిటే ఉంది. 
చదవండి: న్యూజిలాండ్‌లా కాదు.. పాక్‌ ప్రధాన బలం అదే! అందుకే టీమిండియా బ్యాటర్లు..: పాక్‌ మాజీ బౌలర్‌

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)