Breaking News

MI Vs PBKS: ముంబై, పంజాబ్‌ మ్యాచ్‌ వేదిక మార్పు!

Published on Thu, 05/08/2025 - 00:43

న్యూఢిల్లీ/ధర్మశాల: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో భాగంగా ఆదివారం (మే 11) ముంబై ఇండియన్స్, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం పంజాబ్‌ రెండో సొంత మైదానమైన ధర్మశాలలో ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉండగా... ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై జట్టు ధర్మశాలకు చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ను ముంబైలోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతీకార చర్యగా భారత సైన్యం... పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు విమానాశ్రయాలను మూసి వేసింది. దీంతో ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం ముంబై జట్టు ధర్మశాల చేరుకోవడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ‘ఈ మ్యాచ్‌ ముంబైలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని అన్నారు. కాగా... గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ యథావిథిగా జరగనుంది. 

ఈ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే ధర్మశాల చేరుకోవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ‘బీసీసీఐ నుంచి కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో గురువారం మ్యాచ్‌ కోసం ఏర్పాట్లు చేశాం. అధికారికంగా చెప్పనంత వరకు షెడ్యూల్‌ ప్రకారం ముందుకు వెళ్తాం’ అని హిమాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. 

మరోవైపు వేదిక మార్పునకు సంబంధించిన బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ యాజమాన్యం వెల్లడించింది. ఇక ఐపీఎల్‌ సాగడంపై ఎలాంటి అనుమానాలు లేవని... ప్రభుత్వ సూచనల మేరకు లీగ్‌ నిర్వహిస్తామని ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ అన్నారు.   

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)