Breaking News

హార్దిక్‌ పాండ్యా ఔట్‌.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ!

Published on Sat, 11/07/2026 - 19:57

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జట్టు సీనియర్ ఓపెనర్, దిగ్గజ ప్లేయర్ రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలలో రిటెన్షన్ విండో ముగిసేలోపే రోహిత్ శర్మను తిరిగి సారథిగా నియమిస్తూ ముంబై ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

హార్దిక్ పాండ్యా - అర్ష్‌దీప్ సింగ్ ట్రేడింగ్ డీల్!

గత మూడు సీజన్లుగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ట్రేడ్ కానున్నట్లు 'ఇండియా టుడే' జర్నలిస్ట్ రాహుల్ రావత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఈ ట్రేడింగ్ ఒప్పందంలో భాగంగా పంజాబ్ కింగ్స్ తమ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్స్‌ ముంబై ఇండియన్స్‌కు ఇచ్చి, హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇరు జట్ల యాజమాన్యాలు ఇప్పటికే దీనికి సంబంధించిన పత్రాలను బీసీసీఐకి పంపినట్లు తెలుస్తోంది.

కాగా రోహిత్ శర్మ 2013 నుండి 2023 వరకు ముంబై ఇండియన్స్‌కు సారథ్యం వహించి ఏకంగా 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. అయితే 2024 సీజన్‌లో రోహిత్ స్థానంలో అనూహ్యంగా హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

హార్దిక్ నాయకత్వంలో ముంబై జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. గత మూడు సీజన్లలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో జట్టును మళ్లీ విజయాల బాట పట్టించేందుకు, పాత వైభవాన్ని తెచ్చేందుకు  రోహిత్ శర్మకే తిరిగి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)