సూపర్‌ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్‌ కీలక నిర్ణయం

Published on Sun, 12/07/2025 - 13:10

దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో సూపర్‌ సెంచరీ అనంతరం టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ సీనియర్‌ అధికారి ఒకరు ధృవీకరించారు.

జైస్వాల్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో చివరిగా 2023-24 ఎడిషన్‌లో కనిపించాడు. ఈ టోర్నీలో అతడికి మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 26 ఇన్నింగ్స్‌ల్లో 136.42 స్ట్రయిక్‌రేట్‌తో 648 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జైస్వాల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. జైస్వాల్‌కు గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో (టీమిండియా) అవకాశాలు రావడం లేదు. అభిషేక్‌ శర్మ విధ్వంసకర ప్రదర్శనలతో జైస్వాల్‌ స్థానాన్ని ఆక్రమించాడు.

ఇదిలా ఉంటే, భారత వన్డే వెటరన్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ కూడా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ ఆడతాడని ప్రచారం జరుగుతుంది. టెస్ట్‌, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన హిట్‌మ్యాన్‌ ఈ దేశవాలీ టీ20 టోర్నీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. రోహిత్‌ కానీ జైస్వాల్‌ కానీ ముంబై జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే దానిపై అధికారిక సమాచారం లేదు.

ప్రస్తుతం ఎడిషన్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో ఉన్న ముంబై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ఎలైట్‌ గ్రూప్‌-ఏలో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. ఈ జట్టుకు నాకౌట్‌ బెర్త్‌ ఇదివరకే ఖరారైంది. 

ఈ ఎడిషన్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ముంబై జట్టు అదిరిపోయే ప్రదర్శనలు చేస్తుంది. యువ ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే వరుసగా రెండు సెంచరీలతో సత్తా చాటాడు. శార్దూల్‌ ఠాకూర్‌ స్వయంగా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌ను డిసెంబర్‌ 8న ఒడిషాతో ఆడనుంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)