Breaking News

చరిత్ర తిరగరాసిన యూఏఈ కెప్టెన్‌.. రోహిత్‌ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు

Published on Tue, 09/02/2025 - 11:05

యూఏఈ కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. నిన్నటి దాకా టీమిండియా మాజీ టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉన్న ఆ రికార్డును వసీం తన ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈ టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (సెప్టెంబర్‌ 1) జరిగిన మ్యాచ్‌లో 6 సిక్సర్లు బాదిన వసీం.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా అవతరించాడు. 

ఈ క్రమంలో రోహిత్‌ శర్మను వెనక్కు నెట్టాడు. రోహిత్‌ టీమిండియా కెప్టెన్‌గా 62 ఇన్నింగ్స్‌ల్లో 105 సిక్సర్లు బాదగా.. వసీం 54 ఇన్నింగ్స్‌ల్లోనే 110 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితా టాప్‌-4లో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (65 ఇన్నింగ్స్‌ల్లో 86 సిక్సర్లు), ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (76 ఇన్నింగ్స్‌ల్లో 82 సిక్సర్లు) వసీం, రోహిత్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముహమ్మద్‌ వసీం​ మెరుపు అర్ద శతకంతో (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడినా యూఏఈని గెలిపించలేకపోయాడు. అతనికి వికెట్‌కీపర్‌ రాహుల్‌ చోప్రా (35 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సహకరించినా ప్రయోజనం లేకుండా పోయింది. 

మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా రాణించకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యం యూఏఈకి చాలా భారీగా పరిగణించబడింది. రషీద్‌ ఖాన్‌ (4-0-21-3), షరాఫుద్దీన్‌ అష్రఫ్‌ (4-0-24-3) చెలరేగడంతో 150 పరుగులకే పరిమితమై, 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

అంతకుముందు సెదీఖుల్లా అటల్‌ (40 బంతుల్లో 54), ఇబ్రహాం జద్రాన్‌ (40 బంతుల్లో 63), అజ్మతుల్లా (12 బంతుల్లో 20 నాటౌట్‌), కరీమ్‌ జనత్‌ (10 బంతుల్లో 23 నాటౌట్) రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్‌  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

కాగా, ఆసియా కప్‌కు ముందు షార్జా వేదికగా జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు పాకిస్తాన్‌ కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీలో పాక్‌ వరుసగా రెండు విజయాలు (ఆఫ్ఘన్‌, యూఏఈ) సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్‌ తాజా తొలి విజయం నమోదు చేసింది. యూఏఈ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి బోణీ కోసం ఎదురుచూస్తుంది. ఇవాళ పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మరోసారి తలపడనున్నాయి.

 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు