Breaking News

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెటర్‌కు ధోని బహుమతి

Published on Tue, 06/20/2023 - 18:59

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రస్తుత సారధి మహేంద్రసింగ్‌ ధోని ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వికెట్‌ కీపర్‌ రహ్మానుల్లా గుర్భాజ్‌కు ఓ బహుమతి పంపాడు. ధోని తాను సంతకం చేసిన సీఎస్‌కే జెర్సీని గుర్భాజ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని గుర్భాజ్‌ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. ధోని పంపిన గిఫ్ట్‌ను పట్టుకుని ఫోటోకు పోజిస్తూ.. తాను అడిగిన బహుమతిని పంపినందుకు ధోనికి కృతజ్ఞతలు తెలిపాడు. భారత్‌ నుంచి ఈ గిఫ్ట్‌ పంపినందుకు థ్యాంక్స్‌ మాహీ సర్‌ అని ఇన్‌స్టా పేజీలో రాసుకొచ్చాడు. 

కాగా, ఐపీఎల్‌ 2023లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన గుర్భాజ్‌.. ఆ సీజన్‌ ప్రారంభానికి ముందు తనకు ధోనితో కలిసి లేక ధోనికి ప్రత్యర్ధిగా ఆడాలని కోరిక ఉందని తెలిపాడు. ఆ సీజన్‌లోనే గుర్భాజ్‌ కోరిక తీరింది. గుర్భాజ్‌ టీమ్‌ కేకేఆర్‌.. సీఎస్‌కేతో ఓ మ్యాచ్‌ ఆడింది. అయితే ఆ మ్యాచ్‌లో గుర్భాజ్‌ విఫలమయ్యాడు. 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో విఫలమైనా గుర్భాజ్‌ ఐపీఎల్‌ 2023 సీజన్‌ మొత్తంలో ఓ మోస్తరుగా రాణించాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన గుర్భాజ్‌.. 20.64 సగటున, 133.53 స్ట్రయిక్‌ రేట్‌తో 227 పరుగులు చేశాడు. గుర్భాజ్ ఈ సీజన్‌లో వికెట్ల వెనుక కూడా అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో జనాలు గుర్భాజ్‌ను ధోనితో పోల్చడం మొదలుపెట్టారు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం, వికెట్ల వెనుక చురుకుగా ఉండటంతో ఆఫ్ఘన్‌ అభిమానులు గుర్భాజ్‌ను ఆఫ్ఘన్‌ కా ధోని అని పిలుచుకుంటారు.

ఇదిలా ఉంటే, తన అభిమానించే వారికి సంతకం చేసిన జెర్సీ పంపించడం ధోనికి అలవాటే. 2022లో పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌కు కూడా ధోని ఇలాగే సైన్డ్‌ జెర్సీని బహుమతిగా పంపాడు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)