Breaking News

ట్రాక్టర్‌ ఎక్కి పొలం దున్నిన ధోని.. వీడియో వైరల్‌

Published on Thu, 02/09/2023 - 18:58

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని రైతు అవతారంలో తళుక్కుమన్నాడు. ధోని ట్రాక్టర్‌ ఎక్కి పొలం దున్నిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెటర్గా, ఆర్మీ మేజర్గా, ఇటీవలే పోలీస్ ఆఫీసర్గా విభిన్న అవతారాల్లో కనిపించిన ధోనిని ఇలా రైతు లుక్‌లో చూడడం అభిమానులకు పులకింతలు పెట్టింది. స్వయంగా ట్రాక్టర్‌ నడిపిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ధోని.. ''కొత్తది నేర్చుకోవడం బాగుంది.. అయితే పని పూర్తి చేయడానికి మాత్రం చాలా సమయం పట్టింది'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

ఎంఎస్ ధోనికి గ్రామీణ వాతావరణం, వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే సమయం దొరికినప్పుడల్లా..రైతుగా మారుతాడు. ఇప్పటికే ధోని కడక్ నాథ్ కోళ్లను కూడా పెంచుతున్నాడు. ఇటీవలే ఐపీఎల్‌ ప్రాక్టీస్‌లో భాగంగా రాంచీ స్టేడియానికి బైక్‌పై వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు. తాజాగా రైతు లుక్‌లో అభిమానులను అలరించాడు. ఇక  2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్‌ ధోని.. ఆ తర్వాత ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.

గతేడాది సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తనకు తానుగా తప్పుకున్నాడు. ఆ తర్వాత జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికి ఒత్తిడిని తట్టుకోలేక జడ్డూ సీజన్‌ మధ్యలోనే వదిలేశాడు. దీంతో ధోనినే మరోసారి దిక్కయ్యాడు. ఇక 2023 ఐపీఎల్ కోసం ధోని సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు చూసుకుంటే ధోని అన్ని ఫార్మాట్లు కలిపి 538 మ్యాచ్‌లు ఆడాడు. 44.96 సగటుతో 21,834 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 108 అర్థసెంచరీలు చేశాడు. 

చదవండి: జబ్బలు చరుచుకున్నారు.. ఇప్పుడేమైంది

'అందరూ మీలా షార్ప్‌గా ఉండరు'.. ఆసీస్‌ మాజీ క్రికెటర్‌కు చురకలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)