Breaking News

అతడిని తప్పించమని ధోని చెప్పలేదు: మాజీ చీఫ్‌ సెలక్టర్‌

Published on Thu, 03/12/2026 - 15:52

టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని. 2007‍ టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపిన సారథి.

యువీదే కీలక పాత్ర
ఇక ధోని కెప్టెన్సీలో 2007, 2011 ప్రపంచకప్‌ టోర్నీలు గెలిచిన టీమిండియాలో భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సభ్యుడన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంలో అతడిది కీలక పాత్ర. ఈ ఐసీసీ ఈవెంట్లో 363 పరుగులు చేయడంతో పాటు యువీ పదిహేను వికెట్లు కూడా తీశాడు.

అదే సమయంలో యువీ క్యాన్సర్‌ బారిన పడినట్లు తేలగా చాన్నాళ్లు జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని రీఎంట్రీ ఇచ్చినప్పటికీ 2019 వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

తన కుమారుడి కెరీర్‌ నాశనమైందని.. 
ఈ పరిణామాల నేపథ్యంలో యువీ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ (Yograj Singh) ఎల్లప్పుడూ ధోనిని టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ధోని వల్లే తన కుమారుడి కెరీర్‌ నాశనమైందని.. అతడే జట్టులో యువీకి స్థానం లేకుండా చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. యువీ మీద అసూయతోనే ధోని ఇలా చేశాడని ఆరోపించాడు.

ఈ క్రమంలో యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆరోపణలపై టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌ పాటిల్‌ తాజాగా స్పందించాడు. యువీ విషయంలో ధోని ఏనాడూ వివక్ష చూపలేదని.. అతడిని జట్టు నుంచి తప్పించాలని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశాడు.

ధోని ఏనాడూ చెప్పలేదు..
ఈ మేరకు విక్కీ లల్వాణీ షోలో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్‌ కమిటీ సమావేశాలు.. లేదంటే విదేశీ పర్యటనలు.. అదీ కాదంటే మ్యాచ్‌ల సందర్భంగా .. ఇలా ఎప్పుడూ కూడా.. ఏ సందర్భంలోనూ యువరాజ్‌ సింగ్‌ను జట్టు నుంచి తప్పించమని మహేంద్ర సింగ్‌ ధోని ఏనాడూ చెప్పలేదు.

నా మాటలను రికార్డు చేసి పెట్టండి. ధోని ఏనాడూ ఏ ఆటగాడి గురించి చెడుగా చెప్పలేదు. అతడికి సెలక్షన్‌ కమిటీ నిర్ణయంపై పూర్తి నమ్మకం ఉండేది’’ అని యువీ విషయంలో నాడు సెలక్టర్లదే తుది నిర్ణయం అని సందీప్‌ పాటిల్‌ పేర్కొన్నాడు. ఇక ఓ తండ్రిగా యోగ్‌రాజ్‌ ఆవేదనలో తప్పు లేదని.. అయితే, కుమారుడి మీద ప్రేమతో మరొకరిని నిందించడం తగదని హితవు పలికాడు.

చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)