Breaking News

సీఎస్‌కే అభిమానులకు శుభవార్త

Published on Thu, 11/06/2025 - 10:57

2026 ఐపీఎల్‌ (IPL) సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌​ (CSK) అభిమానులకు ఎగిరే గంతేసే శుభవార్త అందింది. ఆ ఫ్రాంచైజీ లెజెండరీ ప్లేయర్‌ ఎంఎస్‌ ధోని (MS Dhoni) వచ్చే సీజన్‌ కూడా ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్‌ స్పష్టం చేశాడు. ధోనికి ఇప్పట్లో రిటైరయ్యే యోచన కూడా లేదని తెలిపాడు.

కాగా, ధోని రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ప్రతి సీజన్‌​కు ముందు పరిపాటిగా మారాయి. అయితే ధోని మాత్రం ఏయేటికాయేడు వాటిని పటాపంచలు చేస్తూ బరిలోకి దిగుతున్నాడు. 2026 సీజన్‌కు ముందు కూడా ఇదే సీన్‌ కొనసాగింది. ధోని వచ్చే సీజన్‌లో బరిలోకి దిగడని ప్రచారం జరిగింది. తాజాగా కాశీ విశ్వనాథ్‌ వ్యాఖ్యలతో ధోని రిటైర్మెంట్‌పై ప్రచారానికి తెరపడింది.

ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగి, ఇప్పటికీ ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ధోని ఇంకెంత కాలం ఐపీఎల్‌ ఆడతాడని క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏయేటికాయేడు ఈ సీజనే ధోనికి లాస్ట్‌ అని అనుకున్నా, అతను మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ కెరీర్‌ను పొడిగిస్తున్నాడు.

2026లోనూ ధోనిని మైదానంలో చూడబోతున్నామన్న వార్త అతని అభిమానులను పిచ్చెక్కిస్తుంది. సింహం మరోసారి బరిలోకి దిగబోతుందంటూ వారు సంబరాలు చేసుకుంటున్నారు.

ఆల్‌టైమ్‌ గ్రేట్‌
ఐపీఎల్‌ ప్రారంభం నుంచి (మధ్యలో రెండు సీజన్లు మినహా) సీఎస్‌కేతోనే ఉన్న ధోని.. ఆ ఫ్రాంచైజీకి ఐదు టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023)అందించాడు. గత సీజన్‌లో మాత్రం సీఎస్‌కే ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. 

కెప్టెన్‌ రుతురాజ్‌ గాయపడటంతో ధోనినే కెప్టెన్సీ బాధ్యతలు మోశాడు. ఆ సీజన్‌లో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో తొలిసారి ఆఖరి స్థానంలో నిలిచింది.

మోకాలి సమస్య
రిటైర్మెంట్‌కు (అంతర్జాతీయ క్రికెట్‌కు) ముందు నుంచి ధోనిని గాయాల సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా కెరీర్‌ మధ్య నుంచి ధోని మోకాలి సమస్యతో బాధ పడుతున్నాడు. 2023లో అతని ఎడమ మోకాలికి ప్రధాన శస్త్రచికిత్స జరిగింది. 

ఆతర్వాత అతను knee brace ధరించి, పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతూ అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహించాడు. 44 ఏళ్ల వయసులోనూ ధోని ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ఆటపై తన ప్రేమను కొనసాగిస్తున్నాడు.

చదవండి: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)