Breaking News

WTC Final 2025: రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు కొట్టిన ట్రివిస్‌ హెడ్‌

Published on Thu, 06/12/2025 - 09:33

లార్డ్స్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2025లో ఆసీస్‌ ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌ ఓ మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్‌లో విఫలమైనా హెడ్‌ (13 బంతుల్లో  11) ఓ ఘనత సాధించాడు. ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్‌ శర్మను అధిగమించి, ఆ స్థానానికి చేరాడు.

ఐసీసీ ఫైనల్స్‌లో రోహిత్‌ 11 ఇన్నింగ్స్‌ల్లో 322 పరుగులు చేయగా.. ఈ మ్యాచ్‌లో పరుగులతో కలుపుకొని హెడ్‌ 4 ఇన్నింగ్స్‌ల్లోనే 329 పరుగులు చేశాడు. ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రికార్డుల రిరాజు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. విరాట్‌ 11 ఇన్నింగ్స్‌ల్లో 411 పరుగులు చేశాడు.

వాస్తవానికి ఈ మ్యాచ్‌కు ముందు హెడ్‌ విరాట్‌ రికార్డుపైనే కన్నేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన రెండో ఇన్నింగ్స్‌లో అయినా హెడ్‌కు విరాట్‌ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో హెడ్‌ 83 పరుగులు చేస్తే విరాట్‌ పేరిట ఉన్న ఈ అల్‌టైమ్‌ రికార్డు బద్దలవుతుంది.

ఘనమైన రికార్డు
ట్రవిస్‌ హెడ్‌కు ఐసీసీ ఫైనల్స్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. 2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 163, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు చేశారు. 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో 137 పరుగులు చేశాడు. తాజాగా జరుగుతున్న 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్లో 11 పరుగులు చేశాడు. హెడ్‌ ఐసీసీ ఫైనల్స్‌లో చేసిన రెండు సెంచరీలు భారత్‌నే చేయడం విశేషం. ఈ సైకిల్‌ డబ్ల్యూటీసీలో భారత్‌ ఫైనల్స్‌కు చేరలేదు. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. రబాడ (5/51), జన్సెన్‌ (3/49),  కేశవ్‌ మహారాజ్‌ (1/19), మార్క్రమ్‌ (1/5) ధాటికి 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను స్టీవ్‌ స్మిత్‌ (66), బ్యూ వెబ్‌స్టర్‌ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్‌ క్యారీ (23) కాసేపు పోరాడాడు.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్మిత్‌, వెబ్‌స్టర్‌, క్యారీతో పాటు లబూషేన్‌ (17), ట్రవిస్‌ హెడ్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా 20 బంతుల డకౌట్‌ కావడంతో ఆసీస్‌ పతనం మొదలైంది. ఈ మ్యాచ్‌తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ఓపెనింగ్‌ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు.

ఖ్వాజాను రబాడ, లబూషేన్‌ను జన్సెన్‌ ఔట్‌ చేశారు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్‌ గ్రీన్‌ (4) దారుణంగా విఫలమయ్యాడు. ఇతని వికెట్‌ కూడా రబాడకే దక్కింది. స్టీవ్‌ స్మిత్‌ను మార్క్రమ్‌, క్యారీని కేశవ​్‌ మహారాజ్‌.. హెడ్‌, లియోన్‌ను (0) జన్సెన్‌ ఔట్‌ చేశారు. వెబ్‌స్టర్‌, కమిన్స్‌ (1), స్టార్క్‌ (1) వికెట్లు రబాడ ఖాతాలోనే వెళ్లాయి.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్‌లోనే మార్క్రమ్‌ను స్టార్క్‌ డకౌట్‌ చేశాడు. జట్టు స్కోర్‌ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ను (16) స్టార్కే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌గా ప్రమోషన్‌ పొందిన వియాన్‌ ముల్దర్‌ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్‌ కమిన్స్‌కు దక్కింది. 

అనంతరం వచ్చిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ను (2) హాజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్‌ భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది.

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)