Breaking News

'అతడు చాలా డేంజర్‌.. ఇంగ్లండ్‌ గెలవాలంటే అదొక్కటే మార్గం'

Published on Tue, 01/09/2024 - 19:20

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌ 2023-25లో తొలి హోమ్ సిరీస్‌కు టీమిండియా సన్నద్దం కానుంది. స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది. జనవరి 25న హైదరాబాద్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్‌లో దుమ్మురేపుతున్న ఇంగ్లండ్‌ను భారత్ ఏ విధంగా బ్రేక్‌లు వేస్తుందో వేచి చూడాలి.

అయితే టెస్టుల్లో సొంత గడ్డపై భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. 2013 నుంచి స్వదేశంలో 46 టెస్టులు ఆడిన టీమిండియా కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది. కానీ ఒక్క టెస్టు సిరీస్‌ను భారత్‌ కోల్పోలేదు. కాగా ఈ హైవోల్టేజ్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ రోహిత్‌ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు.

"భారత బ్యాటర్లు స్పిన్‌కు అద్బుతంగా ఆడుతారు. టర్నింగ్‌ పిచ్‌లపై వారు ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతారు. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. స్పిన్‌ పిచ్‌లపై పండగ చేసుకుంటాడు. టర్నింగ్ పిచ్‌లలో డాన్ బ్రాడ్‌మాన్‌లా హిట్‌మ్యాన్‌  ఆడుతాడు. అతడి రికార్డు అద్బుతం.  టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించాలంటే రోహిత్‌ను ముందుగానే ఔట్ చేయాలి.

రోహిత్‌ దూకుడుకు అడ్డుకట్ట వేస్తే భారత్‌ కొంచెం ఒత్తిడిలోకి వెళ్తుందని" హిందూస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పనేసర్‌ పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో రోహిత్‌కు టెస్టుల్లో మం‍చి రికార్డు ఉంది. 36 ఇన్నింగ్స్‌లలో 66.73 సగటుతో 2002 పరుగులు చేశాడు.
చదవండి: AUS vs PAK: 'అతడు ఓపెనర్‌గా వస్తే.. లారా 400 పరుగుల రికార్డు బద్దలవ్వాల్సిందే'

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)