Breaking News

12 పరుగులకే ఆలౌట్‌.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్‌

Published on Wed, 05/08/2024 - 19:59

అంతర్జాతీయ టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్‌ నమోదైంది. ఏషియన్‌ గేమ్స్‌ గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా జపాన్‌తో ఇవాళ (మే 8) జరిగిన మ్యాచ్‌లో మంగోలియా 12 పరుగులకే ఆలౌటైంది. 

పొట్టి క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్కోర్‌ గతేడాది ఫిబ్రవరి 26న నమోదైంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐసిల్‌ ఆఫ్‌ మ్యాన్‌ జట్టు 10 పరుగులకే చాపచుట్టేసి చెత్త రికార్డు మూటగట్టుకుంది.

మంగోలియాతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జపాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. జపాన్‌ ఇన్నింగ్స్‌లో శబరీష్‌ రవిచంద్రన్‌ (69) అర్దసెంచరీతో రాణించాడు. 

భారీ లక్ష్య ఛేదనకు దిగిన మంగోలియా.. జపాన్‌ బౌలర్ల ధాటికి 8.2 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా జపాన్‌ 205 పరుగుల అతి భారీ తేడాతో విజయం సాధించింది. 

పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఇది నాలుగో భారీ విజయంగా నమోదైంది. 2023లో నేపాల్‌ ఇదే మంగోలియాపై సాధించిన 273 పరుగుల విజయం పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే అతి భారీ విజయంగా నమోదైంది.

ఈ మ్యాచ్‌లో జపాన్‌ బౌలర్‌ కజుమా కటో స్టాఫోర్డ్‌ 3.2 ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డౌట్లయ్యారు. 4 పరుగులు చేసిన సుమియా టాప్‌ స్కోరర్‌ కాగా.. ఎక్స్‌ట్రాల రూపంలో మూడు పరుగులు వచ్చాయి.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)