Breaking News

సిరాజ్‌లో పదును తగ్గిందా!

Published on Sun, 01/19/2025 - 11:00

ముంబై:  2023 నుంచి చూస్తే 28 మ్యాచ్‌లలో 22.7 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ కూడా చాలా మెరుగ్గా (5.41) ఉంది. ఎలా చూసినా ఇది చెప్పుకోదగ్గ ప్రదర్శనే.  సిరాజ్‌ చాలా వరకు నిలకడగా రాణించాడు. అతను మరీ ఘోరంగా విఫలమైన మ్యాచ్‌లు కూడా అరుదు. అయినా సరే...నలుగురు స్పిన్నర్లతో ఆడాలనే టీమిండియా ప్రణాళికల కారణంగా అతనికి చోటు దక్కలేదు.కెప్టెన్ రోహిత్‌ శర్మ మాటల్లో చెప్పాలంటే ఆరంభ ఓవర్లలో కొత్త బంతితో చెలరేగినంతగా సిరాజ్‌ చివర్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. 

బంతి పాతబడిన కొద్దీ అతని ప్రభావం తగ్గుతోంది. ఇప్పటికే టి20ల్లో తనను తాను నిరూపించుకోవడంతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఆకట్టుకున్న అర్ష్‌దీప్‌ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకముంచారు. ఎడమచేతి వాటం బౌలర్‌ కావడం అతనికి మరో అదనపు అర్హతగా మారింది. ‘ఆరంభంలో, చివర్లో కూడా బాగా బౌలింగ్‌ చేయగలిగే ఆటగాడు మాకు కావాలి. కొత్త బంతితో షమీ ఏం చేయగలడో అందరికీ తెలుసు. చివర్లో ఆ బాధ్యతఅర్ష్‌దీప్‌ తీసుకోగలడు. సరిగ్గా ఇక్కడే సిరాజ్‌ ప్రభావం తగ్గుతూ వస్తోంది. 

అతను కొత్త బంతితో తప్ప చివర్లో ఆశించిన ప్రదర్శన ఇవ్వడం లేదు. దీనిపై మేం చాలా సుదీర్ఘంగా చర్చించాం. ఆల్‌రౌండర్లు కావాలి కాబట్టి ముగ్గురు పేసర్లనే తీసుకున్నాం. సిరాజ్‌ లేకపోవడం దురదృష్టకరమే కానీ కొన్ని రకాల బాధ్యతల కోసం కొందరిని తీసుకొని మరికొందరిని పక్కన పెట్టక తప్పదు’ అని రోహిత్‌ వివరించాడు.   

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)