Breaking News

టీమిండియాకు ఊహించని షాక్‌.. స్వదేశానికి పయనమైన స్టార్‌ ప్లేయర్‌

Published on Thu, 07/27/2023 - 12:08

బార్బడోస్‌ వేదికగా విండీస్‌తో ఇవాళ (జులై 27) జరుగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు ఊహించని షాక్‌ తగలింది. స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వన్డే సిరీస్‌ మొత్తానికి దూరం అయ్యాడు. వర్క్‌ లోడ్‌ కారణంగా సిరాజ్‌కు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తుంది. వన్డే, టీ20 జట్లలో లేని టీమిండియా సభ్యులతో పాటు సిరాజ్‌ స్వదేశానికి పయనమయ్యాడని సమాచారం. ఆసియా కప్‌, వరల్డ్‌కప్‌లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 

విండీస్‌తో రెండో టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన సిరాజ్‌.. గత కొంత కాలంగా నిర్విరామంగా క్రికెట్‌ ఆడుతున్నాడు. సీనియర్లు బుమ్రా, షమీ గైర్హాజరీలో ఆ ఫార్మాట్‌, ఈ ఫార్మాట్‌ అన్న తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో బిజీగా మారాడు. బిజీగా మారడమే కాకుండా భారత పేస్‌ విభాగాన్ని విజయవంతంగా ముందుండి నడిపించాడు. 

త్వరలో టీమిండియా మెగా ఈవెంట్లలో పాల్గొననున్న నేపథ్యంలో సిరాజ్‌ గాయాల బారిన పడకుండా ఉండేందుకు బీసీసీఐ అతన్ని విండీస్‌ పర్యటన నుంచి అర్థాంతరంగా స్వదేశానికి పిలిపించింది. సిరాజ్‌కు రీప్లేస్‌మెంట్‌ ఎవరనే దానిపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి క్లూ ఇవ్వలేదు. అందుబాటులో ఉన్న బౌలర్లతోనే నెట్టుకురావలన్నది బీసీసీఐ ఆలోచనగా తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే, విండీస్‌ ఇవాళ జరుగనున్న తొలి వన్డేలో సిరాజ్‌ గైర్హాజరీలో ఉమ్రాన్‌ మాలిక్‌ టీమిండియా పేస్‌ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం జట్టులో ఉన్న పేసర్లలో ఉమ్రానే ఎక్కువ వన్డేలు (8) ఆడాడు. తొలి వన్డే కోసం ఎంపిక చేసే తుది జట్టులో స్పెషలిస్ట్‌ పేసర్లుగా ఉమ్రాన్‌, ఉనద్కత్‌లకు అవకాశం దక్కవచ్చు. పార్ట్‌ టైమ్‌ పేసర్లుగా ఆల్‌రౌండర్లు హార్ధిక్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు తుది జట్టులో ఉండవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)