Breaking News

కివీస్‌తో మ్యాచ్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్ లాంటిది: మహ్మద్‌ సిరాజ్‌

Published on Sat, 01/17/2026 - 18:24

న్యూజిలాండ్‌తో ఆదివారం ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో తాడో పేడో తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు కివీస్ కూడా భారత గడ్డపై మరోసారి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది.

ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌ను వరల్డ్‌కప్ ఫైనల్‌లా భావిస్తున్నామని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో రెండు జట్లు సమవుజ్జీలగా ఉన్నాయి. గత పర్యటన మాదిరిగానే భారత జట్టుకు కివీస్ గట్టీ పోటీ ఇస్తుంది. అందుకే సిరాజ్ ఆఖరి వన్డేను ప్రపంచకప్ ఫైనల్‌తో పోల్చాడు.

భారత్‌లో మాకు ఇటువంటి పరిస్థితులు చాలా అరుదుగా ఎదురవుతుంటాయి. మొన్న సౌతాఫ్రికా, నేడు న్యూజిలాండ్‌. చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఈ మ్యాచ్ మాకు దాదాపు ప్రపంచ కప్ ఫైనల్ లాంటిది. జట్టులోని సీనియర్లు యువ ఆటగాళ్లకు చాలా మద్దతుగా ఉన్నారు. వారు నుంచి మాకు  సలహాలు, సూచనలు అందుతున్నాయి.

దీంతో డ్రెసింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. మేము మొదటి మ్యాచ్ గెలిచాం. దురదృష్టవశాత్తూ రెండో వన్డేలో ఓడిపోయాం. కాబట్టి ఇప్పుడు మాపై కాస్త ఒత్తిడి ఉంది. రాజ్‌కోట్ వన్డేలో డారిల్ మిచెల్ అవుట్ చేసేందుకు అన్ని విధాలంగా ప్రయాత్నించాము. కానీ  ఒక క్యాచ్ డ్రాప్ కావడం వల్ల మ్యాచ్ పరిస్థితి మారిపోయింది.

అతడు స్పిన్‌ను ఎదుర్కొనే తీరు, సింగిల్స్ తీస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచే విధానం నిజంగా అద్భుతం. మా బౌలింగ్ గురుంచి ఎలాంటి ఆందోళన లేదు. జట్టులో ప్రతీ ఒక్కరు పాజిటివ్ మైండ్‌తో ఉన్నారు. సిరీస్ డిసైడర్‌లో తప్పక గెలుస్తాము" అని సిరాజ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)